ఏఁటి జాణతనము నీవే(విదే?)మయ్యా
(॥పల్లవి॥)
ఏఁటి జాణతనము నీవే(విదే?)మయ్యా
ఆఁటదానిమీఁద నీవదేమయ్యా
(॥ఏఁటి॥)
చిత్తరు ప్రతిమవలెఁ బేరి నిలుచుండఁగాను
హత్తి రమ్మని పిలువవదేమయ్యా
కొత్తకొత్త సిగ్గుతోడ కురులు దువ్వుకోఁగాను
యిత్తల మాటలాడించేవిదేమయ్యా
(॥ఏఁటి॥)
మూసిన ముత్తెమువలె ముసుగు వెట్టుకుండఁగా-
నాసఁ గూచుండఁ బెట్టుకోవదేమయ్యా
సేసకొప్పు వంచుకొని చింతతోడనుండఁగాను
యీసుదీరఁ జెక్కు నొక్కవిదేమయ్యా
(॥ఏఁటి॥)
తనియని తమకాన తప్పక నిన్నుఁ జూడఁగా
అనుగు సరసమాడవదేమయ్యా
యెనసితి శ్రీవేంకటేశ యింతి నీవిట్టే
యినుమడించె వలపులిదేమయ్యా
(||pallavi||)
em̐ṭi jāṇadanamu nīve(vide?)mayyā
ām̐ṭadānimīm̐da nīvademayyā
(||em̐ṭi||)
sittaru pradimavalĕm̐ beri nilusuṁḍam̐gānu
hatti rammani piluvavademayyā
kŏttagŏtta siggudoḍa kurulu duvvugom̐gānu
yittala māḍalāḍiṁchevidemayyā
(||em̐ṭi||)
mūsina muttĕmuvalĕ musugu vĕṭṭuguṁḍam̐gā-
nāsam̐ gūsuṁḍam̐ bĕṭṭugovademayyā
sesagŏppu vaṁchugŏni siṁtadoḍanuṁḍam̐gānu
yīsudīram̐ jĕkku nŏkkavidemayyā
(||em̐ṭi||)
taniyani tamagāna tappaga ninnum̐ jūḍam̐gā
anugu sarasamāḍavademayyā
yĕnasidi śhrīveṁkaḍeśha yiṁti nīviṭṭe
yinumaḍiṁchĕ valabulidemayyā