Emtesi yaasalu yeduvamti kobaalu

ఎంతేసి యాసలు యెటువంటి కోపాలు
Language

(॥పల్లవి॥)
ఎంతేసి యాసలు యెటువంటి కోపాలు
యింతలో సరస మాడే రిదివో మీరు

(॥ఎంతే॥)
అద్దమరేతిరికాడి అలుకలు దేరెనా
యిద్దరు మీలో నేఁడు యేక మైతిరి
బుద్దులు నేము చెప్పితే పూఁచి వినరైతిరి
అద్దివో నవ్వులు నవ్వే రపుడే మీరు

(॥ఎంతే॥)
మచ్చరాన రాయివంటిమనసులు గరఁగెనా
గచ్చుల మీమేనులకాఁక దేరెనా
కుచ్చి నె మెంత మొక్కినా గొబ్బనఁ గైకోరై తిరి
మెచ్చుకొనే రిప్పుడైతే మీలోనే మీరు

(॥ఎంతే॥)
ముందువెనకల నేఁచేముచ్చ టెల్లఁ బాసెనా
సందడి మీవలపులు చవి వుట్టెనా
అందపుశ్రీవేంకటేశ ఆపే నీవూఁ గూడితిరి
కందువ నిప్పుడైతే మాకైవశ మైతిరి

(||pallavi||)
ĕṁtesi yāsalu yĕḍuvaṁṭi kobālu
yiṁtalo sarasa māḍe ridivo mīru

(||ĕṁte||)
addamaredirigāḍi alugalu derĕnā
yiddaru mīlo nem̐ḍu yega maidiri
buddulu nemu sĕppide pūm̐si vinaraidiri
addivo navvulu navve rabuḍe mīru

(||ĕṁte||)
machcharāna rāyivaṁṭimanasulu garam̐gĕnā
gachchula mīmenulagām̐ka derĕnā
kuchchi nĕ mĕṁta mŏkkinā gŏbbanam̐ gaigorai tiri
mĕchchugŏne rippuḍaide mīlone mīru

(||ĕṁte||)
muṁduvĕnagala nem̐semuchcha ṭĕllam̐ bāsĕnā
saṁdaḍi mīvalabulu savi vuṭṭĕnā
aṁdabuśhrīveṁkaḍeśha ābe nīvūm̐ gūḍidiri
kaṁduva nippuḍaide māgaivaśha maidiri