Emtesi vesaalu sesee needamdu nenu

ఎంతేసి వేసాలు సేసీ నీతఁడు నేను
Language

(॥పల్లవి॥)
ఎంతేసి వేసాలు సేసీ నీతఁడు నేను
వింత వింత సుద్దులెల్లా వినరమ్మ చెలులు

(॥ఎంతే॥)
మచ్చిక నా చూపులు మర్మములు గాఁడెనంటా
కొచ్చి కొచ్చి తనకొనగోర నూఁదీనే
కచ్చుపెట్టి నామాఁటలు కళలు రేఁగించెనంటా
కుచ్చితాన నందరిలో కొంగేల పట్టీనే

(॥ఎంతే॥)
సెలవుల నా నవ్వులు సిగ్గులు వరచెనంటా
చలపాదితనమున చన్నులంటీనే
కలికి నాచేఁతలు కడు వలపించెనంటా
పెలుచు నామోవి యెంత పిప్పిసేసీనే

(॥ఎంతే॥)
ఇట్టె నా చక్కఁదనము యెలయించెనంటాను
బట్టెగాఁ గాఁగిట సారె బిగించీనే
గుట్టుతోడ నారతులు గొనకొని మించెనంటా
వొట్టుక శ్రీవేంకటేశుఁ డోలలెట్టు వేసీనే

(||pallavi||)
ĕṁtesi vesālu sesī nīdam̐ḍu nenu
viṁta viṁta suddulĕllā vinaramma sĕlulu

(||ĕṁte||)
machchiga nā sūbulu marmamulu gām̐ḍĕnaṁṭā
kŏchchi kŏchchi tanagŏnagora nūm̐dīne
kachchubĕṭṭi nāmām̐ṭalu kaḽalu rem̐giṁchĕnaṁṭā
kuchchidāna naṁdarilo kŏṁgela paṭṭīne

(||ĕṁte||)
sĕlavula nā navvulu siggulu varasĕnaṁṭā
salabādidanamuna sannulaṁṭīne
kaligi nāsem̐talu kaḍu valabiṁchĕnaṁṭā
pĕlusu nāmovi yĕṁta pippisesīne

(||ĕṁte||)
iṭṭĕ nā sakkam̐danamu yĕlayiṁchĕnaṁṭānu
baṭṭĕgām̐ gām̐giḍa sārĕ bigiṁchīne
guṭṭudoḍa nāradulu gŏnagŏni miṁchĕnaṁṭā
vŏṭṭuga śhrīveṁkaḍeśhum̐ ḍolalĕṭṭu vesīne