ఎంతేసి కాఁగలదో ఇన్నియును నిట్లాయ
(॥పల్లవి॥)
ఎంతేసి కాఁగలదో ఇన్నియును నిట్లాయ
యెంతవింతలు వొడమె నెదురెదురనె
(॥ఎంతే॥)
పడఁతివేనలి జారి పగలు చీఁకట్లాయ
వొడలఁ బులకలు చుక్కలు రక పొడమె
తొడరి కనుబొమ్మలను ధూమకేతువు దోఁచె
పొడమెనుత్పాతములు పూటఁపూటఁకును
(॥ఎంతే॥)
పరిగొనుచు విరహంపుపతిసూర్యుఁ డుదఇంచె
వొరిమఁ జెమటల జలధు లుప్పొంగెను
ఇరవైననిట్టూర్పు లేడుగాడ్పులు విసరె
పరగ విపరీతంబు పైపైనె మెరసె
(॥ఎంతే॥)
జడిగొనుచు కుచగిరులు చంద్రశకలము లలరె
నగవులను నిచ్చపున్నమ లాయను
సొగిసి శ్రీవేంకటేశుఁడు చెలియఁగూడఁగా
పగలు రేయును నేరుపడదాయను
(||pallavi||)
ĕṁtesi kām̐galado inniyunu niṭlāya
yĕṁtaviṁtalu vŏḍamĕ nĕdurĕduranĕ
(||ĕṁte||)
paḍam̐tivenali jāri pagalu sīm̐kaṭlāya
vŏḍalam̐ bulagalu sukkalu raga pŏḍamĕ
tŏḍari kanubŏmmalanu dhūmageduvu dom̐sĕ
pŏḍamĕnutpādamulu pūḍam̐pūḍam̐kunu
(||ĕṁte||)
parigŏnusu virahaṁpubadisūryum̐ ḍuda̮iṁchĕ
vŏrimam̐ jĕmaḍala jaladhu luppŏṁgĕnu
iravainaniṭṭūrbu leḍugāḍpulu visarĕ
paraga vibarīdaṁbu paibainĕ mĕrasĕ
(||ĕṁte||)
jaḍigŏnusu kusagirulu saṁdraśhagalamu lalarĕ
nagavulanu nichchabunnama lāyanu
sŏgisi śhrīveṁkaḍeśhum̐ḍu sĕliyam̐gūḍam̐gā
pagalu reyunu nerubaḍadāyanu