ఎంతయిన నెఱఁగవు యేమని బుద్దిచెప్పిన
(॥పల్లవి॥)
ఎంతయిన నెఱఁగవు యేమని బుద్దిచెప్పిన
బంతినే మాకు సిగ్గయ్యీ పైపై నిన్నుఁ జూచి
(॥ఎంత॥)
చల్లలమ్మేవారితోడ జాణతనాలాడనేల
గొల్లెతలచేఁ దిట్టించుకొననేల
కొల్లలుగ మందలోన గోవులపాలు దాగి
బల్లి దుఁడవై యిట్టె బదుకరాదా
(॥ఎంత॥)
కందువల వెన్నదీసేకాంతలతో నవ్వనేల
కిందుపడి అంకులు దాఁకించుకోనేల
పొందుగ బాఁపన వారి పోరచికూళ్లారగించి
బందు కలవాఁడవై బలియరాదా
(॥ఎంత॥)
దొడ్డిలోన నేడు మమ్ము తొడికి కూడఁగనేల
గొడ్డేరేనీవు బుసకొట్టఁగనేల
వొడ్డుక శ్రీవేంకటేశ వూరవిందు లారగించి
వెడ్డాఁగమయి నీవు వెలయరాదా
(||pallavi||)
ĕṁtayina nĕṟam̐gavu yemani buddisĕppina
baṁtine māgu siggayyī paibai ninnum̐ jūsi
(||ĕṁta||)
sallalammevāridoḍa jāṇadanālāḍanela
gŏllĕdalasem̐ diṭṭiṁchugŏnanela
kŏllaluga maṁdalona govulabālu dāgi
balli dum̐ḍavai yiṭṭĕ badugarādā
(||ĕṁta||)
kaṁduvala vĕnnadīsegāṁtalado navvanela
kiṁdubaḍi aṁkulu dām̐kiṁchugonela
pŏṁduga bām̐pana vāri porasigūḽlāragiṁchi
baṁdu kalavām̐ḍavai baliyarādā
(||ĕṁta||)
dŏḍḍilona neḍu mammu tŏḍigi kūḍam̐ganela
gŏḍḍerenīvu busagŏṭṭam̐ganela
vŏḍḍuga śhrīveṁkaḍeśha vūraviṁdu lāragiṁchi
vĕḍḍām̐gamayi nīvu vĕlayarādā