ఎంతయిన మమ్ము నీవు యేలినట్టివాఁడవు
(॥పల్లవి॥)
ఎంతయిన మమ్ము నీవు యేలినట్టివాఁడవు
పంతగత్తెనైతినంటాఁ బదరేవు సుమ్మీ
(॥ఎంత॥)
కాతరాన నే నిన్నుఁ గడవనాడిమాట
జాతులు సేసేవు సుమ్మీ సతులలోను
చేతికి లోనాయనంటా చిక్కని నాచన్నులపై
ఘూతలు నించేవు సుమ్మీ ఘనుఁడ మొక్కేను
(॥ఎంత॥)
మేరమీరి నే నీతో మేలుకు నవ్విననవ్వు
ఆరసి చెప్పేవు సుమ్మీ ఆండ్లతోను
కూరిమి నీతోడమీఁదఁ గూచుంటినంటాఁ బిరుఁదు
సారె నదిమేవు సుమ్మీ సరుగ మొక్కేను
(॥ఎంత॥)
అగ్గలమై రతివేళ నంగములు సోఁకినందు-
కెగ్గులువట్టేవు సుమ్మీ యిందరిలోను
నిగ్గుల శ్రీవేంకటాద్రినిలయ గోవిందరాజ
వెగ్గళించేవు సుమ్మీ వేడుక మొక్కేను
(||pallavi||)
ĕṁtayina mammu nīvu yelinaṭṭivām̐ḍavu
paṁtagattĕnaidinaṁṭām̐ badarevu summī
(||ĕṁta||)
kādarāna ne ninnum̐ gaḍavanāḍimāḍa
jādulu sesevu summī sadulalonu
sedigi lonāyanaṁṭā sikkani nāsannulabai
ghūdalu niṁchevu summī ghanum̐ḍa mŏkkenu
(||ĕṁta||)
meramīri ne nīdo melugu navvinanavvu
ārasi sĕppevu summī āṁḍladonu
kūrimi nīdoḍamīm̐dam̐ gūsuṁṭinaṁṭām̐ birum̐du
sārĕ nadimevu summī saruga mŏkkenu
(||ĕṁta||)
aggalamai radiveḽa naṁgamulu som̐kinaṁdu-
kĕgguluvaṭṭevu summī yiṁdarilonu
niggula śhrīveṁkaḍādrinilaya goviṁdarāja
vĕggaḽiṁchevu summī veḍuga mŏkkenu