Emtayina maanavu ni nnemi sedunu

ఎంతయిన మానవు ని న్నేమి సేతును
Language

(॥పల్లవి॥)
ఎంతయిన మానవు ని న్నేమి సేతును
పంతపు నీ సుద్దులకు భ్రమ సున్నదానము

(॥ఎం తయిన॥)
నగదు గాదు నీతోడ నాఁడె నేఁ జెప్పనా
తెగి మాలో నవ్వితే నేఁ దిట్టుదు నవి
మొగము చూడఁగ నీకు ముందెనే మొక్కనా
తగుల నాడకు మమ్ముఁ దడవకు మనుచు

(॥ఎంతయిన॥)
నను పై యిన్నా ళ్లాయ నాతలఁ పెరఁగవా
తనివోని కక్కూరితిదానఁ గాన నీ
చనవు నేసి యింతుల సాకిరులుఁ బెట్టనా
పెనఁగకు మమ్ముఁ బేరఁ బిలువకు మనుచు

(॥ఎంతయిన॥)
నీ వేల నమ్మవో కాక నీవే నేఁ గానా
వాని నీవు దెలయవా వదినె నని
ఆవల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
తావులఁ గూడితి వింకఁ దమక మే లనుచూ

(||pallavi||)
ĕṁtayina mānavu ni nnemi sedunu
paṁtabu nī suddulagu bhrama sunnadānamu

(||ĕṁ tayina||)
nagadu gādu nīdoḍa nām̐ḍĕ nem̐ jĕppanā
tĕgi mālo navvide nem̐ diṭṭudu navi
mŏgamu sūḍam̐ga nīgu muṁdĕne mŏkkanā
tagula nāḍagu mammum̐ daḍavagu manusu

(||ĕṁtayina||)
nanu pai yinnā ḽlāya nādalam̐ pĕram̐gavā
tanivoni kakkūrididānam̐ gāna nī
sanavu nesi yiṁtula sāgirulum̐ bĕṭṭanā
pĕnam̐gagu mammum̐ beram̐ biluvagu manusu

(||ĕṁtayina||)
nī vela nammavo kāga nīve nem̐ gānā
vāni nīvu dĕlayavā vadinĕ nani
āvala śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
tāvulam̐ gūḍidi viṁkam̐ damaga me lanusū