ఎంతవేగిరకాఁడవు యేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎంతవేగిరకాఁడవు యేమి చెప్పేది
పంతమెల్ల నీవు నాపైఁ బచరించేవు
(॥ఎంత॥)
కూరిమి నేనాడినకొసరుమాటలకు
ఆరీతిఁ దారుకాణించుమని యాడేవు
నేరుపుతో మెలఁగితే నీవే బదికేవు మఱి
వారకపునీగుణా లెవ్వరికి వచ్చీని
(॥ఎంత॥)
ననుపున నే నీతో నవ్వినసుద్దల కెల్లా
పెనఁగి నీవానలేల పెట్టవచ్చేవు
అనువుగా నిజమరివైతే నిన్నే పొగడేరు
వొనర నొకరికీరి తొకరి నంటీనా
(॥ఎంత॥)
కూడేవేళనే నిన్ను గోరు సోఁకించినందుకు
చూడఁజాతి రతి నెంత సూడువట్టేవు
యీడుగా శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
యీడేరినచుట్టరిక మిద్దరికుండీని
(||pallavi||)
ĕṁtavegiragām̐ḍavu yemi sĕppedi
paṁtamĕlla nīvu nābaim̐ basariṁchevu
(||ĕṁta||)
kūrimi nenāḍinagŏsarumāḍalagu
ārīdim̐ dārugāṇiṁchumani yāḍevu
nerubudo mĕlam̐gide nīve badigevu maṟi
vāragabunīguṇā lĕvvarigi vachchīni
(||ĕṁta||)
nanubuna ne nīdo navvinasuddala kĕllā
pĕnam̐gi nīvānalela pĕṭṭavachchevu
anuvugā nijamarivaide ninne pŏgaḍeru
vŏnara nŏgarigīri tŏgari naṁṭīnā
(||ĕṁta||)
kūḍeveḽane ninnu goru som̐kiṁchinaṁdugu
sūḍam̐jādi radi nĕṁta sūḍuvaṭṭevu
yīḍugā śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
yīḍerinasuṭṭariga middariguṁḍīni