Emtavedugo neegu niduvamtisemtalu

ఎంతవేడుకో నీకు నిటువంటిచేఁతలు
Language

(॥పల్లవి॥)
ఎంతవేడుకో నీకు నిటువంటిచేఁతలు
మంతుకెక్క నేనూ నీమతి గరఁగించేను

(॥ఎంత॥)
చుల్లరితనాన నీపైఁ జూపులు చిమ్ము కొంటా
బిల్లఁగోట్లాడీ నీప్రియురాలు
కొల్లలుగఁ గొనగోళ్లఁ గుంకుమచెమట నించి
చల్లీ వసంతము నీపై జవరాలు

(॥ఎంత॥)
వాడికమాటల నిన్ను వలపులు రేఁచి రేఁ
వేడుకలు గాదెఁబోసీ నుదుటులు చూపుకొంటా
వోడక బొమ్మజంకెన నుదుటులు చూపుకొంటా
జాడతోఁ బంతాలు దూసీ చదురాలు

(॥ఎంత॥)
సేసవెట్టి నిన్నుఁగూడి చిరునవ్వు నవ్వుకొంటా
మూసిదాఁచీ సిగ్గులు ముద్దరాలు
వాసితో శ్రీవేంకటేశ వరుసరతుల నీకు
యీసుదీర సేవసేసీ నిచ్చకురాలు

(||pallavi||)
ĕṁtaveḍugo nīgu niḍuvaṁṭisem̐talu
maṁtugĕkka nenū nīmadi garam̐giṁchenu

(||ĕṁta||)
sullaridanāna nībaim̐ jūbulu simmu kŏṁṭā
billam̐goṭlāḍī nīpriyurālu
kŏllalugam̐ gŏnagoḽlam̐ guṁkumasĕmaḍa niṁchi
sallī vasaṁtamu nībai javarālu

(||ĕṁta||)
vāḍigamāḍala ninnu valabulu rem̐si rem̐
veḍugalu gādĕm̐bosī nuduḍulu sūbugŏṁṭā
voḍaga bŏmmajaṁkĕna nuduḍulu sūbugŏṁṭā
jāḍadom̐ baṁtālu dūsī sadurālu

(||ĕṁta||)
sesavĕṭṭi ninnum̐gūḍi sirunavvu navvugŏṁṭā
mūsidām̐sī siggulu muddarālu
vāsido śhrīveṁkaḍeśha varusaradula nīgu
yīsudīra sevasesī nichchagurālu