Emtavani sesidivo yimdaamkaa neevu

ఎంతవని సేసితివో యిందాఁకా నీవు
Language

(॥పల్లవి॥)
ఎంతవని సేసితివో యిందాఁకా నీవు
చెంత నిన్ను గిజి గిజి సేసిన దెవ్వతయ్యా

(॥ఎంత॥)
చెక్కులవెంటా నిండుఁ జమటలు గారఁగాను
యెక్కడ నుండి వచ్చితి వేమయ్యా
మక్కువతో నిన్నుఁ జూచి మనసు నీరై కరఁగె
అక్కడ నెవ్వతె నిన్ను నలయించెనయ్యా

(॥ఎంత॥)
వీఁపువెంటాఁ గొప్పువీడి విరులు రాలఁగాను
యేపున వడదేరీ యో మిదేలయ్యా
వోపిన నీ యలమటకొగిఁ గనికరమాయ
రాఁపుల నిన్నుఁ బెట్టిన రమణి యెవ్వతెయ్యా

(॥ఎంత॥)
సెలవులవెంటాఁ దమ్మచెదరులు రాలఁగాను
యెలమిఁ గప్రమడిగే వెంత కెంతయ్యా
అలరి శ్రీవేంకటేశ యట్టె నన్ను నేలితివి
పొలఁతి యెవ్వతె నిన్నుఁ బుత్తెంచెనయ్యా

(||pallavi||)
ĕṁtavani sesidivo yiṁdām̐kā nīvu
sĕṁta ninnu giji giji sesina dĕvvadayyā

(||ĕṁta||)
sĕkkulavĕṁṭā niṁḍum̐ jamaḍalu gāram̐gānu
yĕkkaḍa nuṁḍi vachchidi vemayyā
makkuvado ninnum̐ jūsi manasu nīrai karam̐gĕ
akkaḍa nĕvvadĕ ninnu nalayiṁchĕnayyā

(||ĕṁta||)
vīm̐puvĕṁṭām̐ gŏppuvīḍi virulu rālam̐gānu
yebuna vaḍaderī yo midelayyā
vobina nī yalamaḍagŏgim̐ ganigaramāya
rām̐pula ninnum̐ bĕṭṭina ramaṇi yĕvvadĕyyā

(||ĕṁta||)
sĕlavulavĕṁṭām̐ dammasĕdarulu rālam̐gānu
yĕlamim̐ gapramaḍige vĕṁta kĕṁtayyā
alari śhrīveṁkaḍeśha yaṭṭĕ nannu nelidivi
pŏlam̐ti yĕvvadĕ ninnum̐ buttĕṁchĕnayyā