ఎంతవడిదాఁకానే నీ యెలయింపులు
(॥పల్లవి॥)
ఎంతవడిదాఁకానే నీ యెలయింపులు
పంతము లిప్పుడే నీవు పచరించఁదగునా
(॥ఎంత॥)
వెలయ నన్నీఁజేసినవిభుడే వేఁడుకొనఁగా
చలపాదితనమేల సకియకును
వలచినవలపులు వడి నెదలో నుండఁగ
వెలుపల వట్టిగుట్టు వెదచల్లఁదగునా
(॥ఎంత॥)
ఆసలఁబెట్టియేఁచినయాతఁడే పైకొనఁగాను
వేసదారియలుకేలే వెలఁది నీకు
సేసవెట్టినపెండ్లి చేతిలోనే పుండఁగాను
బేసబెల్లిబిగువులు పెనఁచఁగఁదగునా
(॥ఎంత॥)
వెక్కెసపుసుద్దుల శ్రీవేంకటేశుఁడే కూడఁగా
కక్కసించ నింతయేల కాంతరో నీకు
మిక్కుటపురతిసొంపు మేనిమీఁద నుండఁగాను
జక్కనగుబ్బల నొత్తి జఱయఁగదగునా
(||pallavi||)
ĕṁtavaḍidām̐kāne nī yĕlayiṁpulu
paṁtamu lippuḍe nīvu pasariṁcham̐dagunā
(||ĕṁta||)
vĕlaya nannīm̐jesinavibhuḍe vem̐ḍugŏnam̐gā
salabādidanamela sagiyagunu
valasinavalabulu vaḍi nĕdalo nuṁḍam̐ga
vĕlubala vaṭṭiguṭṭu vĕdasallam̐dagunā
(||ĕṁta||)
āsalam̐bĕṭṭiyem̐sinayādam̐ḍe paigŏnam̐gānu
vesadāriyalugele vĕlam̐di nīgu
sesavĕṭṭinabĕṁḍli sedilone puṁḍam̐gānu
besabĕllibiguvulu pĕnam̐sam̐gam̐dagunā
(||ĕṁta||)
vĕkkĕsabusuddula śhrīveṁkaḍeśhum̐ḍe kūḍam̐gā
kakkasiṁcha niṁtayela kāṁtaro nīgu
mikkuḍaburadisŏṁpu menimīm̐da nuṁḍam̐gānu
jakkanagubbala nŏtti jaṟayam̐gadagunā