ఎంతవడి సరసము లిద్దరును నాడేరు
(॥పల్లవి॥)
ఎంతవడి సరసము లిద్దరును నాడేరు
పంతములు వచ్చె మీరు బాగాలందుకోరాదా
(॥ఎంత॥)
వేడుకతో నాపె నిన్ను విరులను వేయఁగాను
నీడనుండి గందవొడి నీవు చల్లేవు
జాడతోడ నవ్వినవ్వి చలములు వెగ్గళించి
చూడఁజూడఁ జెమటలు జొబ్బిలించె నీకును
(॥ఎంత॥)
కొలువుతో జవరాలు గోర నిన్ను గీరఁగాను
చెలఁగి యాపెచన్నులు చేత నంటేవు
తలకొని యాసాసలఁ దమకము లుప్పతిలి
నిలువునఁ బులకలు నిగుడించె నీకును
(॥ఎంత॥)
చిక్కంచు కలమేల్‌మంగ చెక్కు నీకు నోక్కఁగాను
అక్కున శ్రీవేంకటేశ అలమితివి
మిక్కుటపుఁ గోరికల మీదమీఁద మీమోముల
తక్కక సంతోసాలు దైవారించె నీకును
(||pallavi||)
ĕṁtavaḍi sarasamu liddarunu nāḍeru
paṁtamulu vachchĕ mīru bāgālaṁdugorādā
(||ĕṁta||)
veḍugado nābĕ ninnu virulanu veyam̐gānu
nīḍanuṁḍi gaṁdavŏḍi nīvu sallevu
jāḍadoḍa navvinavvi salamulu vĕggaḽiṁchi
sūḍam̐jūḍam̐ jĕmaḍalu jŏbbiliṁchĕ nīgunu
(||ĕṁta||)
kŏluvudo javarālu gora ninnu gīram̐gānu
sĕlam̐gi yābĕsannulu seda naṁṭevu
talagŏni yāsāsalam̐ damagamu luppadili
niluvunam̐ bulagalu niguḍiṁchĕ nīgunu
(||ĕṁta||)
sikkaṁchu kalamelmaṁga sĕkku nīgu nokkam̐gānu
akkuna śhrīveṁkaḍeśha alamidivi
mikkuḍabum̐ gorigala mīdamīm̐da mīmomula
takkaga saṁtosālu daivāriṁchĕ nīgunu