Emtavadi nee yaluga yemdaamkaa votlu

ఎంతవడి నీ యలుక యెందాఁకా వొట్లు
Language

(॥పల్లవి॥)
ఎంతవడి నీ యలుక యెందాఁకా వొట్లు
పంతపు నీ రమణుఁడు పైకొనీ నిదివో

(॥ఎంత॥)
చిలుకుఁదేరెను మోవిఁ జిందీ ననుచు నీవు
పలుకవదేమే పతితోను
కులుకుఁ గుచాల వుబ్బు కుంగీననుచు నిట్టె
అలమ విదేమే ఆతనిని

(॥ఎంత॥)
నునువాఁడి కొనగోరు నొగిలీ ననుచు నీవు
చెనకవదేమే చెలువునిని
అనుఁగు నీకనుచూపు లంటీ ననుచు నిట్టె
యెనయఁ జూడవేలే యీతనిని

(॥ఎంత॥)
పాయపు నీజవ్వనము పచ్చ గందీనని నీవు
చేయిచ్చి దగ్గరవేమే శ్రీ వేంకటేశు
యీయెడ నాతఁడే వచ్చి యిటు నిన్ను నేఁడు గూడె
నీయంత నెఱఁగవేమే నిండుదంటతనము

(||pallavi||)
ĕṁtavaḍi nī yaluga yĕṁdām̐kā vŏṭlu
paṁtabu nī ramaṇum̐ḍu paigŏnī nidivo

(||ĕṁta||)
silugum̐derĕnu movim̐ jiṁdī nanusu nīvu
palugavademe padidonu
kulugum̐ gusāla vubbu kuṁgīnanusu niṭṭĕ
alama videme ādanini

(||ĕṁta||)
nunuvām̐ḍi kŏnagoru nŏgilī nanusu nīvu
sĕnagavademe sĕluvunini
anum̐gu nīganusūbu laṁṭī nanusu niṭṭĕ
yĕnayam̐ jūḍavele yīdanini

(||ĕṁta||)
pāyabu nījavvanamu pachcha gaṁdīnani nīvu
seyichchi daggaraveme śhrī veṁkaḍeśhu
yīyĕḍa nādam̐ḍe vachchi yiḍu ninnu nem̐ḍu gūḍĕ
nīyaṁta nĕṟam̐gaveme niṁḍudaṁṭadanamu