Emtavadi guttusese vikkadanayyaa

ఎంతవడి గుట్టుసేసే విక్కడనయ్యా
Language

(॥పల్లవి॥)
ఎంతవడి గుట్టుసేసే విక్కడనయ్యా
దొంతర వలపులకు తోవేదయ్యా

(॥ఎంత॥)
కామినిచూపులు నీపై కలువదండలై నిండె
యేమయ్య వూరకున్నాఁడ వెందాఁకాను
దోమటినవ్వులు కప్రధూళియై నీమేను ముంచె
మేమరుముచ్చటలకు వేళ యెప్పుడయ్యా

(॥ఎంత॥)
పడఁతి మొక్కులు నీకుఁ బల్లవపుఁబరపాయ
తడవవేమయ్య యెంతదడవాయను
జడిగొన్న వూరుపులు చల్లనిసురట్లాయ
జడియనిరతి కవసర మెప్పుడయ్యా

(॥ఎంత॥)
ముదితమాటలు నీకు ముత్యాలసేసలాయ
యెదురుకొనవలదా ఇఁకనైనాను
కదిసితి రిద్దరును గక్కన శ్రీవేంకటేశ
చదురులాడుటకును సమయమేదయ్యా

(||pallavi||)
ĕṁtavaḍi guṭṭusese vikkaḍanayyā
dŏṁtara valabulagu tovedayyā

(||ĕṁta||)
kāminisūbulu nībai kaluvadaṁḍalai niṁḍĕ
yemayya vūragunnām̐ḍa vĕṁdām̐kānu
domaḍinavvulu kapradhūḽiyai nīmenu muṁchĕ
memarumuchchaḍalagu veḽa yĕppuḍayyā

(||ĕṁta||)
paḍam̐ti mŏkkulu nīgum̐ ballavabum̐barabāya
taḍavavemayya yĕṁtadaḍavāyanu
jaḍigŏnna vūrubulu sallanisuraṭlāya
jaḍiyaniradi kavasara mĕppuḍayyā

(||ĕṁta||)
mudidamāḍalu nīgu mutyālasesalāya
yĕdurugŏnavaladā im̐kanainānu
kadisidi riddarunu gakkana śhrīveṁkaḍeśha
sadurulāḍuḍagunu samayamedayyā