Emtavaddanna maana vimdugum jochchidivi

ఎంతవద్దన్న మాన విందుకుఁ జొచ్చితివి
Language

(॥పల్లవి॥)
ఎంతవద్దన్న మాన విందుకుఁ జొచ్చితివి
మంతుకెక్కించేవు నన్ను మరియేమి సేతురా

(॥॥)
చెనకకు నీవు నన్ను చేతుల చాఁచి
కొనలు వాండ్లు నీగోరు దాఁకీని
ననుఁ జూచితేఁ జెలులు నవ్వేరిఁక
యెనలేని సిగ్గు ముంచీ నేమిసేతురా

(॥॥)
ముట్టికు నామెడనున్న ముత్తేలు నీవేళ్లను
గట్టులు నాచన్నులతో కంగురనీని
చుట్టిరానున్న చెలులు చూచి నవ్వేరు
యిట్టే నాకు సిగ్గు ముంచీ నేమి సేతురా

(॥॥)
పోయ కెదుగా సేసలు పొంచి నీదోసిలైతే
చాయల సారెకుఁ దాఁకి జారీఁ గొప్పు
యీయెడఁ బెండ్లాడితివి యిట్టే శ్రీవేంకటేశ
యేయెడ సిగ్గులు ముంచీ నేమి సేతురా

(||pallavi||)
ĕṁtavaddanna māna viṁdugum̐ jŏchchidivi
maṁtugĕkkiṁchevu nannu mariyemi sedurā

(||||)
sĕnagagu nīvu nannu sedula sām̐si
kŏnalu vāṁḍlu nīgoru dām̐kīni
nanum̐ jūsidem̐ jĕlulu navverim̐ka
yĕnaleni siggu muṁchī nemisedurā

(||||)
muṭṭigu nāmĕḍanunna muttelu nīveḽlanu
gaṭṭulu nāsannulado kaṁguranīni
suṭṭirānunna sĕlulu sūsi navveru
yiṭṭe nāgu siggu muṁchī nemi sedurā

(||||)
poya kĕdugā sesalu pŏṁchi nīdosilaide
sāyala sārĕgum̐ dām̐ki jārīm̐ gŏppu
yīyĕḍam̐ bĕṁḍlāḍidivi yiṭṭe śhrīveṁkaḍeśha
yeyĕḍa siggulu muṁchī nemi sedurā