ఎంతవాఁడవయ్యా నిన్ను నేమనేము
(॥పల్లవి॥)
ఎంతవాఁడవయ్యా నిన్ను నేమనేము
సంతకూటములవాఁడ సంబటూరి చెన్నుఁడా
(॥ఎంత॥)
సోగకన్నులనుఁజూచి సొలపులమాట లాడి
వాగపుగొల్లెతలను వలపించేవు
జాగులనవ్వులు నవ్వి జాజరపాటలు వాడి
బాగుగా నప్పటిఁ గొంత భ్రమయించేవు
(॥ఎంత॥)
బింకపుసాములు సేసి బెట్టుగాఁ బువ్వులు వేసి
అంకెకువచ్చినదాఁకా నాసరేఁచేవు
లంకెలనుఁ గూచుండి లలితో మర్మము లంటి
మంకుఁదనములవారి మరిగించేవు
(॥ఎంత॥)
చీరలకొంగులు వట్టి సిగ్గులు బయటవేసి
గారవించి కాఁగిటను కరఁగించేవు
యీరీతి శ్రీవేంకటేశ యిందరిని యేలుకొని
మేరమీరి చనవిచ్చి మెప్పించేవు
(||pallavi||)
ĕṁtavām̐ḍavayyā ninnu nemanemu
saṁtagūḍamulavām̐ḍa saṁbaḍūri sĕnnum̐ḍā
(||ĕṁta||)
sogagannulanum̐jūsi sŏlabulamāḍa lāḍi
vāgabugŏllĕdalanu valabiṁchevu
jāgulanavvulu navvi jājarabāḍalu vāḍi
bāgugā nappaḍim̐ gŏṁta bhramayiṁchevu
(||ĕṁta||)
biṁkabusāmulu sesi bĕṭṭugām̐ buvvulu vesi
aṁkĕguvachchinadām̐kā nāsarem̐sevu
laṁkĕlanum̐ gūsuṁḍi lalido marmamu laṁṭi
maṁkum̐danamulavāri marigiṁchevu
(||ĕṁta||)
sīralagŏṁgulu vaṭṭi siggulu bayaḍavesi
gāraviṁchi kām̐giḍanu karam̐giṁchevu
yīrīdi śhrīveṁkaḍeśha yiṁdarini yelugŏni
meramīri sanavichchi mĕppiṁchevu