Emtavaamdavayya ninnu neṟimgebaadivaaramaa

ఎంతవాఁడవయ్య నిన్ను నెఱిఁగేపాటివారమా
Language

(॥పల్లవి॥)
ఎంతవాఁడవయ్య నిన్ను నెఱిఁగేపాటివారమా
దొంతరసిగ్గులనెల్లఁ దొరలించుకొంటివి

(॥ఎంత॥)
చలము సాదించనేర్పుజాణవుగనక నీవు
బలిమి నాపెచేయి వట్టితివి
వలపులకీ లెఱుఁగువాఁడవుగనక నీవు
వెలయఁగ బోఁకముడి విడిచితివి

(॥ఎంత॥)
దొరతనముగలట్టిదొడ్డ వాఁడవుగనక
సరసాన నాపెకొప్పు జారించితివి
అరుదుగఁ బంతమే కూడైన వాఁడవుగనక
పరగఁ జన్నులమీఁదిపయ్యద దీసితివి

(॥ఎంత॥)
గబ్బితనము ల శ్రీవేంకటపతిగనక
నిబ్బరపలమేల్మంగ నీవు గూడితి
వుబ్బరితనములకు నొపేవాఁడవుగనక
గొబ్బున నన్నేలి యీకెఁ గొలిపించితివి

(||pallavi||)
ĕṁtavām̐ḍavayya ninnu nĕṟim̐gebāḍivāramā
dŏṁtarasiggulanĕllam̐ dŏraliṁchugŏṁṭivi

(||ĕṁta||)
salamu sādiṁchanerbujāṇavuganaga nīvu
balimi nābĕseyi vaṭṭidivi
valabulagī lĕṟum̐guvām̐ḍavuganaga nīvu
vĕlayam̐ga bom̐kamuḍi viḍisidivi

(||ĕṁta||)
dŏradanamugalaṭṭidŏḍḍa vām̐ḍavuganaga
sarasāna nābĕgŏppu jāriṁchidivi
arudugam̐ baṁtame kūḍaina vām̐ḍavuganaga
paragam̐ jannulamīm̐dibayyada dīsidivi

(||ĕṁta||)
gabbidanamu la śhrīveṁkaḍabadiganaga
nibbarabalamelmaṁga nīvu gūḍidi
vubbaridanamulagu nŏbevām̐ḍavuganaga
gŏbbuna nanneli yīgĕm̐ gŏlibiṁchidivi