ఎంతవాఁడైనాగాని యేమాయ నేఁడు
(॥పల్లవి॥)
ఎంతవాఁడైనాగాని యేమాయ నేఁడు
పొంత నీకు వలపించి పొత్తున బెట్టెనే
(॥ఎంత॥)
మాటలాడితేఁజాలు మట్టుకుఁదెచ్చే నతని
యేటికి మనికితము ఇంతిరో నీకు
సూటిగా నామో మతఁడు చూచితేఁజాలుఁగాన
వాఁటముగా నతని నీవసము చేసేనే
(॥ఎంత॥)
అండనిలిచితేఁ జాలు అతని నొడఁబరచే
నిండుఁగాఁతాళ మేఁటికే నెట్టన నీకు
చండిసేయక కానుక చయ్యన నంటితేఁజాలు
పండిన మనసులోనిపంపు సేయించేనే
(॥ఎంత॥)
చెవులొగ్గితేఁ జాలు చెప్పి నీతోఁ బొందుసేసే
ఇవల విచారమేలే ఇప్పడు నీకు
తవిలి వచ్చి కూడెను తానె శ్రీవేంకటేశుఁడు
తపనఁ దప్పక నీకు దక్కి వుండఁజేసేనే
(||pallavi||)
ĕṁtavām̐ḍaināgāni yemāya nem̐ḍu
pŏṁta nīgu valabiṁchi pŏttuna bĕṭṭĕne
(||ĕṁta||)
māḍalāḍidem̐jālu maṭṭugum̐dĕchche nadani
yeḍigi manigidamu iṁtiro nīgu
sūḍigā nāmo madam̐ḍu sūsidem̐jālum̐gāna
vām̐ṭamugā nadani nīvasamu sesene
(||ĕṁta||)
aṁḍanilisidem̐ jālu adani nŏḍam̐barase
niṁḍum̐gām̐tāḽa mem̐ṭige nĕṭṭana nīgu
saṁḍiseyaga kānuga sayyana naṁṭidem̐jālu
paṁḍina manasulonibaṁpu seyiṁchene
(||ĕṁta||)
sĕvulŏggidem̐ jālu sĕppi nīdom̐ bŏṁdusese
ivala visāramele ippaḍu nīgu
tavili vachchi kūḍĕnu tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu
tabanam̐ dappaga nīgu dakki vuṁḍam̐jesene