Emtavaamda vaina ninnu nimta sesidi

ఎంతవాఁడ వైన నిన్ను నింత సేసితి
Language

(॥పల్లవి॥)
ఎంతవాఁడ వైన నిన్ను నింత సేసితి
యింతిని నాయపరాధా లెట్టోరిచేవయ్యా

(॥ఎంత॥)
చేర రమ్మంటే రా నైతి చెక్కులు చేత గిల్లితి
గారవించఁగా నిన్ను గసరితిని
కూరిమి గొసరఁగాను కోపాన జంకించితిని
యీరీతి నాయపరాధా లె ట్టోరిచే వయ్యా

(॥ఎంత॥)
మనసు నొప్పించితిని మాట లెల్లా నాడితిని
చెనకఁగా వద్దని పైఁ జేయి వేసితి
పెనఁగితి నీతోడఁ బ్రేమము రెట్టించఁగాను
యెనసి నాయపరాదా లె ట్టోరిచే వయ్యా

(॥ఎంత॥)
కందువులు నీ వంటఁగా గాఁగిలించితి సిగ్గున
విందుల నీరతులకు వేసరుకొంటి
అందుకొని శ్రీవెంకటాధిప నిన్నుఁ గూడితి
నిందు నాయపరాదా లె ట్టోరిచే వయ్యా

(||pallavi||)
ĕṁtavām̐ḍa vaina ninnu niṁta sesidi
yiṁtini nāyabarādhā lĕṭṭorisevayyā

(||ĕṁta||)
sera rammaṁṭe rā naidi sĕkkulu seda gillidi
gāraviṁcham̐gā ninnu gasaridini
kūrimi gŏsaram̐gānu kobāna jaṁkiṁchidini
yīrīdi nāyabarādhā lĕ ṭṭorise vayyā

(||ĕṁta||)
manasu nŏppiṁchidini māḍa lĕllā nāḍidini
sĕnagam̐gā vaddani paim̐ jeyi vesidi
pĕnam̐gidi nīdoḍam̐ bremamu rĕṭṭiṁcham̐gānu
yĕnasi nāyabarādā lĕ ṭṭorise vayyā

(||ĕṁta||)
kaṁduvulu nī vaṁṭam̐gā gām̐giliṁchidi sigguna
viṁdula nīradulagu vesarugŏṁṭi
aṁdugŏni śhrīvĕṁkaḍādhiba ninnum̐ gūḍidi
niṁdu nāyabarādā lĕ ṭṭorise vayyā