ఎంతచేసినా నీకు నెదురాడేనా
(॥పల్లవి॥)
ఎంతచేసినా నీకు నెదురాడేనా
బంతినే మమ్మేల వొడఁబరచేవు నీవు
(॥ఎంత॥)
మాట లెన్నిలేవు నీవు మాపుదాఁకా నాడితేను
చాటువగా నేము వినఁజాలముగాక
వాఁటమై యిందాఁకా నాపెవద్ద నుండి వచ్చి నేఁడు
పాటించి మమ్మేల వొడఁబరచేవు నీవు
(॥ఎంత॥)
చేఁత లెన్నిలేవు నీవు చెంతనుండి చేసితేను
వూఁతగాఁ దప్పకచూడనోపముగాక
పాఁతపడఁతికి నిట్టె బాసలెల్లాఁ జేసివచ్చి
బాఁతితో మమ్మేల వొడఁబరచేవు నీవు
(॥ఎంత॥)
మొక్క లెన్నిలేవు నీవు మునుకొని మొక్కితేను
నెక్కొని సమ్మతించనేరముగాక
ఇక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
పక్కన మమ్మేల వొడఁబరచేవు నీవు
(||pallavi||)
ĕṁtasesinā nīgu nĕdurāḍenā
baṁtine mammela vŏḍam̐barasevu nīvu
(||ĕṁta||)
māḍa lĕnnilevu nīvu mābudām̐kā nāḍidenu
sāḍuvagā nemu vinam̐jālamugāga
vām̐ṭamai yiṁdām̐kā nābĕvadda nuṁḍi vachchi nem̐ḍu
pāḍiṁchi mammela vŏḍam̐barasevu nīvu
(||ĕṁta||)
sem̐ta lĕnnilevu nīvu sĕṁtanuṁḍi sesidenu
vūm̐tagām̐ dappagasūḍanobamugāga
pām̐tabaḍam̐tigi niṭṭĕ bāsalĕllām̐ jesivachchi
bām̐tido mammela vŏḍam̐barasevu nīvu
(||ĕṁta||)
mŏkka lĕnnilevu nīvu munugŏni mŏkkidenu
nĕkkŏni sammadiṁchaneramugāga
ikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
pakkana mammela vŏḍam̐barasevu nīvu