(॥పల్లవి॥)
ఎంతసేసినా నెడయకే పోయ
ముంతలోని నీట మునిఁగి లేచుట
(॥ఎంత॥)
ఉట్టిపై చెరలాట మూరఁబొత్తులకూడు
పట్టుచాలనికొమ్ము బహునాయకము
వెట్టిమోపరిలాగు వెఱ్ఱివోయినపోక
నట్టింటివైరంబు నగుఁబాటుబ్రదుకు
(॥ఎంత॥)
రాకపోకలచేత రాఁగిన పెనుఁబుండు
వాకులేనివరము వలవనివలుపు
యేకాలము వేంకటేశునికృపలేక
ఆకడీకడ నడయాడెడినడపు
(||pallavi||)
ĕṁtasesinā nĕḍayage poya
muṁtaloni nīḍa munim̐gi lesuḍa
(||ĕṁta||)
uṭṭibai sĕralāḍa mūram̐bŏttulagūḍu
paṭṭusālanigŏmmu bahunāyagamu
vĕṭṭimobarilāgu vĕṭrivoyinaboga
naṭṭiṁṭivairaṁbu nagum̐bāḍubradugu
(||ĕṁta||)
rāgabogalaseda rām̐gina pĕnum̐buṁḍu
vāgulenivaramu valavanivalubu
yegālamu veṁkaḍeśhunikṛpalega
āgaḍīgaḍa naḍayāḍĕḍinaḍabu