Emtasesina neevidya lela maanevu

ఎంతచేసిన నీవిద్య లేల మానేవు
Language

(॥పల్లవి॥)
ఎంతచేసిన నీవిద్య లేల మానేవు
బంతినే నీ నవ్వులెల్లాఁ బచరింతువుగాక

(॥ఎంత॥)
వెక్కసపుమాఁట లాడి వేమారు నిన్నుఁ దిట్టేటి-
యెక్కువసతులకుఁగా కేల వంగేవు
మొక్కులు మొక్కి నేము ముందే సేవలుసేయఁగ
మిక్కుటపుపంతాలు మామీఁద నింతువుగాక

(॥ఎంత॥)
కొప్పువట్టితీసి నిన్ను గోరు నీమీఁదఁ బెట్టేటి-
యెప్పటియింతులకుఁగా కేల వంగేవు
ముప్పిరిఁ బ్రియాలుచెప్పి మొగమోడి పొందఁగాను
ఇప్పు డింతేసి మమ్ము నెలయించఁదగదా

(॥ఎంత॥)
పరపుపైఁ బడవేసి పచ్చిమోవి గంటిచేసే-
యెరవులవారికిఁగా కేల వంగేవు
అరిది శ్రీవేంకటేశ ఆలమేల్మంగ నేనంటా
సరవిఁ గూడితి వింత చవిసేయవలదా

(||pallavi||)
ĕṁtasesina nīvidya lela mānevu
baṁtine nī navvulĕllām̐ basariṁtuvugāga

(||ĕṁta||)
vĕkkasabumām̐ṭa lāḍi vemāru ninnum̐ diṭṭeḍi-
yĕkkuvasadulagum̐gā kela vaṁgevu
mŏkkulu mŏkki nemu muṁde sevaluseyam̐ga
mikkuḍabubaṁtālu māmīm̐da niṁtuvugāga

(||ĕṁta||)
kŏppuvaṭṭidīsi ninnu goru nīmīm̐dam̐ bĕṭṭeḍi-
yĕppaḍiyiṁtulagum̐gā kela vaṁgevu
muppirim̐ briyālusĕppi mŏgamoḍi pŏṁdam̐gānu
ippu ḍiṁtesi mammu nĕlayiṁcham̐dagadā

(||ĕṁta||)
parabubaim̐ baḍavesi pachchimovi gaṁṭisese-
yĕravulavārigim̐gā kela vaṁgevu
aridi śhrīveṁkaḍeśha ālamelmaṁga nenaṁṭā
saravim̐ gūḍidi viṁta saviseyavaladā