Emtaseppinaa neṟamgavele salamu

ఎంతచెప్పినా నెఱఁగవేలే చలము
Language

(॥పల్లవి॥)
ఎంతచెప్పినా నెఱఁగవేలే చలము
పంతగాఁడు నేఁడు వాని పనులెల్లా దక్కెను

(॥ఎంత॥)
ఆతఁడు నీతో మాటలాడఁడంటా నిలుచుంటే
యేతులకే పాటవాడేవేమే చలము
కాతరించి యాఁటదింత కక్కూరితిపడితేను
చేతులార మగవాఁడు చేసినట్టే చెల్లదా

(॥ఎంత॥)
చుట్టి చుట్టాతఁడు నన్నుఁ జూడవలెనంటానే
యిట్టే జోలి మొక్కు మొక్కేవేలే చలము
గుట్టు తోడి మగువలు కోరి తామె పైకొంటే
బెట్టుగాఁ దన విభుఁడు బిగియక మానఁడు

(॥ఎంత॥)
పై పై శ్రీ వేంకటేశుఁడు పరాకై వున్నాఁడంటే
యేపు మీఱి నవ్వు నవ్వేవేలే చలము
రాఁపుగాని యాఁటదింత రతికిఁ బెనఁగితేను
యీపొద్దాతఁడిట్టె కూడె నెదురాడఁగలనా

(||pallavi||)
ĕṁtasĕppinā nĕṟam̐gavele salamu
paṁtagām̐ḍu nem̐ḍu vāni panulĕllā dakkĕnu

(||ĕṁta||)
ādam̐ḍu nīdo māḍalāḍam̐ḍaṁṭā nilusuṁṭe
yedulage pāḍavāḍeveme salamu
kādariṁchi yām̐ṭadiṁta kakkūridibaḍidenu
sedulāra magavām̐ḍu sesinaṭṭe sĕlladā

(||ĕṁta||)
suṭṭi suṭṭādam̐ḍu nannum̐ jūḍavalĕnaṁṭāne
yiṭṭe joli mŏkku mŏkkevele salamu
guṭṭu toḍi maguvalu kori tāmĕ paigŏṁṭe
bĕṭṭugām̐ dana vibhum̐ḍu bigiyaga mānam̐ḍu

(||ĕṁta||)
pai pai śhrī veṁkaḍeśhum̐ḍu parāgai vunnām̐ḍaṁṭe
yebu mīṟi navvu navvevele salamu
rām̐pugāni yām̐ṭadiṁta radigim̐ bĕnam̐gidenu
yībŏddādam̐ḍiṭṭĕ kūḍĕ nĕdurāḍam̐galanā