ఎంతచెప్పినా మాన విదేరా నీవు
(॥పల్లవి॥)
ఎంతచెప్పినా మాన విదేరా నీవు
కాంత లైన వారి నింత కాకు సేతురా
(॥ఎంత॥)
యిట్టె చన్ను లంటకుర యిస్సీ యిందరుఁ జూడ
వొట్టి నీవద్దికి వచ్చి వున్న నేరమా
తిట్టుదుఁ జుమ్మీ నాతెరువు వచ్చితేఁ గన
గుట్టున నుండుదు గాని కొం తైన నోరి
(॥ఎంత॥)
తొడ మీఁద వేయకుర తోతో యిందరు నవ్వేరు
యెడయక దగ్గరితే నిదే పనా
కడు గోపిఁ జుమ్మీ నేను కలదె విన్నవించితి
బడలించకుర నన్ను పలుమారు నోరి
(॥ఎంత॥)
పచ్చిమాఁట లాడకుర పడఁతు లెల్లా వినేరు
అచ్చ మై నే నీతో మాట లాడినందుకా
యిచ్చగించి శ్రీవెంకటేశ నిన్నుఁ గూడితి
నిచ్చ నలమేలుమంగ నేఁ జుమ్మీ వోరి
(||pallavi||)
ĕṁtasĕppinā māna viderā nīvu
kāṁta laina vāri niṁta kāgu sedurā
(||ĕṁta||)
yiṭṭĕ sannu laṁṭagura yissī yiṁdarum̐ jūḍa
vŏṭṭi nīvaddigi vachchi vunna neramā
tiṭṭudum̐ jummī nādĕruvu vachchidem̐ gana
guṭṭuna nuṁḍudu gāni kŏṁ taina nori
(||ĕṁta||)
tŏḍa mīm̐da veyagura todo yiṁdaru navveru
yĕḍayaga daggaride nide panā
kaḍu gobim̐ jummī nenu kaladĕ vinnaviṁchidi
baḍaliṁchagura nannu palumāru nori
(||ĕṁta||)
pachchimām̐ṭa lāḍagura paḍam̐tu lĕllā vineru
achcha mai ne nīdo māḍa lāḍinaṁdugā
yichchagiṁchi śhrīvĕṁkaḍeśha ninnum̐ gūḍidi
nichcha nalamelumaṁga nem̐ jummī vori