Emtapriyamu galige namta podalu valabu

ఎంతప్రియము గలిగె నంత పొదలు వలపు
Language

(॥పల్లవి॥)
ఎంతప్రియము గలిగె నంత పొదలు వలపు
వింతలే కాఁటదానికి వినయమే నేరుపు

(॥ఎంత॥)
చిత్తమురా మాటలాడి చెలువునిమీఁదట
బత్తిచూపవలెఁగాక పడఁతికిని
కొత్తగా నేరాలువేసి కూరిమిఁ గొసరుకొంటా
హత్తి వెంగెములాడేది అది యేఁటినేరుపే

(॥ఎంత॥)
సముకాన నిలుచుండి సరసములాడి పతిఁ
దమకించవలెఁగాక తరుణికిని
జమళి వద్దనే వుండి సారెకు నలుగుకొంటా
అమరని కాఁక చల్లే దది యేఁటినేరుపే

(॥ఎంత॥)
అలమేలు మంగవలె నటు శ్రీవేంకటేశ్వరుఁ
గలయఁగవలెఁగాక కామినికిని
పెలుచుఁదనాన రతిఁ బెనగులాడుకొంటాను
అలయించి చొక్కించే దది యేఁటినేరుపే

(||pallavi||)
ĕṁtapriyamu galigĕ naṁta pŏdalu valabu
viṁtale kām̐ṭadānigi vinayame nerubu

(||ĕṁta||)
sittamurā māḍalāḍi sĕluvunimīm̐daḍa
battisūbavalĕm̐gāga paḍam̐tigini
kŏttagā nerāluvesi kūrimim̐ gŏsarugŏṁṭā
hatti vĕṁgĕmulāḍedi adi yem̐ṭinerube

(||ĕṁta||)
samugāna nilusuṁḍi sarasamulāḍi padim̐
damagiṁchavalĕm̐gāga taruṇigini
jamaḽi vaddane vuṁḍi sārĕgu nalugugŏṁṭā
amarani kām̐ka salle dadi yem̐ṭinerube

(||ĕṁta||)
alamelu maṁgavalĕ naḍu śhrīveṁkaḍeśhvarum̐
galayam̐gavalĕm̐gāga kāminigini
pĕlusum̐danāna radim̐ bĕnagulāḍugŏṁṭānu
alayiṁchi sŏkkiṁche dadi yem̐ṭinerube