Emtapradaabamo nidi yemchi sooside

ఎంతప్రతాపమో నిది యెంచి చూచితే
Language

(॥పల్లవి॥)
ఎంతప్రతాపమో నిది యెంచి చూచితే
వింతలేల నిన్ను సేవించు టింతె కాక

(॥ఎంత॥)
ముప్పిరి నీ సంకల్పము ముంచి బ్రహ్మేంద్రాదులైన
తప్పించలేరు మఱి దాఁటా లేరు
యెప్పుడైనా దైత్యులపై యెత్తిన నీ చే చక్రము
తిప్పలేరు నీ మహిమ తెలియా లేరు

(॥ఎంత॥)
అముక నీవు మన్నించే నంటే ననాది కర్మాలు
యేమిటా మానుప లేవు యిప్పించా లేవు
నేమించక లోకాలపై నీవు పరాకై వుండితే
ప్రేమం బెడరేఁచలేవు పెనఁగా లేవు

(॥ఎంత॥)
చేరి నీవు మమ్మేలితే చేసిన యపరాధాలు
మారుకొన లేవు మఱి మలయా లేవు
గారవాన నలమేల్మంగపతి శ్రీవేంకటేశ
యీ రీతి నీవే కాక యితరులు లేరూ

(||pallavi||)
ĕṁtapradābamo nidi yĕṁchi sūside
viṁtalela ninnu seviṁchu ṭiṁtĕ kāga

(||ĕṁta||)
muppiri nī saṁkalbamu muṁchi brahmeṁdrādulaina
tappiṁchaleru maṟi dām̐ṭā leru
yĕppuḍainā daityulabai yĕttina nī se sakramu
tippaleru nī mahima tĕliyā leru

(||ĕṁta||)
amuga nīvu manniṁche naṁṭe nanādi karmālu
yemiḍā mānuba levu yippiṁchā levu
nemiṁchaga logālabai nīvu parāgai vuṁḍide
premaṁ bĕḍarem̐salevu pĕnam̐gā levu

(||ĕṁta||)
seri nīvu mammelide sesina yabarādhālu
mārugŏna levu maṟi malayā levu
gāravāna nalamelmaṁgabadi śhrīveṁkaḍeśha
yī rīdi nīve kāga yidarulu lerū