ఎంతనోము నోఁచితినో యేమిచెప్పేది
(॥పల్లవి॥)
ఎంతనోము నోఁచితినో యేమిచెప్పేది
మంతుకెక్క నింకా చింత మన్నించేవు గాక
(॥॥)
మేకొని నీ వాడేటిమేలములు కావా
లాకలై నామోమునఁ గళలు రేఁచేవి
జోకతోడ నీతోడిచుట్టరికమే కాదా
యేకాలమును నిన్ను నెడయనియ్యనిది
(॥॥)
ననుపున నీవు నాతో నవ్విననవ్వులే కావా
తనివిదీరకుండాఁ దలపించేవి
పెనఁగి కొప్పుపై నీవు పెట్టిన సేసలే కావా
యెనసి నీకాఁగిటిలో నింతకుఁ దెచ్చినవి
(॥॥)
చన్నులపై నీవు చేయిచాఁచిన రతులే కావా
పన్నిన వలపులై పాదుకొన్నవి
యిన్నిటా శ్రీవెంకటేశ యేలితివి నన్ను నేఁడు
కన్నులచూపులేకావా కామించఁ జేసినవి
(||pallavi||)
ĕṁtanomu nom̐sidino yemisĕppedi
maṁtugĕkka niṁkā siṁta manniṁchevu gāga
(||||)
megŏni nī vāḍeḍimelamulu kāvā
lāgalai nāmomunam̐ gaḽalu rem̐sevi
jogadoḍa nīdoḍisuṭṭarigame kādā
yegālamunu ninnu nĕḍayaniyyanidi
(||||)
nanubuna nīvu nādo navvinanavvule kāvā
tanividīraguṁḍām̐ dalabiṁchevi
pĕnam̐gi kŏppubai nīvu pĕṭṭina sesale kāvā
yĕnasi nīgām̐giḍilo niṁtagum̐ dĕchchinavi
(||||)
sannulabai nīvu seyisām̐sina radule kāvā
pannina valabulai pādugŏnnavi
yinniḍā śhrīvĕṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kannulasūbulegāvā kāmiṁcham̐ jesinavi