ఎంతని చెప్పుదునే యిటువంటి నా వలపు
(॥పల్లవి॥)
ఎంతని చెప్పుదునే యిటువంటి నా వలపు
మంతు కెక్కించి నన్ను మన్నించు మనవే
(॥ఎంత॥)
చెనకి నవ్వేపతితో సిగ్గులు వడఁగ రాదు
తనివోనికోరికలు దాఁచా రావు
మొనసి మాటాడించఁగ మోనమున నుండరాదు
మునుపటితమకము మూటగట్ట రాదు
(॥ఎంత॥)
తానె నన్నుఁ జూడఁగాను తల వంచుకొనరాదు
వూనిన నావేడుకల నొద్దన రాదు
వూని కొంగు వట్టఁగాను బొమ్మల జంకించరాదు
తానకపు టాసలచేఁ దప్పించుకొనరాదు
(॥ఎంత॥)
పలుమారు గూడఁగాను భావించి యలయరాదు
తిలకించి రతికిఁ బిరితియ్యరాదు
అలర శ్రీవేంకటేశుఁ డన్నిటా నన్ను నేలే
సెలవుల నవ్వు రాఁగాఁ జేరి ముయ్యరాదు
(||pallavi||)
ĕṁtani sĕppudune yiḍuvaṁṭi nā valabu
maṁtu kĕkkiṁchi nannu manniṁchu manave
(||ĕṁta||)
sĕnagi navvebadido siggulu vaḍam̐ga rādu
tanivonigorigalu dām̐sā rāvu
mŏnasi māḍāḍiṁcham̐ga monamuna nuṁḍarādu
munubaḍidamagamu mūḍagaṭṭa rādu
(||ĕṁta||)
tānĕ nannum̐ jūḍam̐gānu tala vaṁchugŏnarādu
vūnina nāveḍugala nŏddana rādu
vūni kŏṁgu vaṭṭam̐gānu bŏmmala jaṁkiṁcharādu
tānagabu ṭāsalasem̐ dappiṁchugŏnarādu
(||ĕṁta||)
palumāru gūḍam̐gānu bhāviṁchi yalayarādu
tilagiṁchi radigim̐ biridiyyarādu
alara śhrīveṁkaḍeśhum̐ ḍanniḍā nannu nele
sĕlavula navvu rām̐gām̐ jeri muyyarādu