ఎంతని చెప్పేము నేము ఇవిగో మీ గుణములు
(॥పల్లవి॥)
ఎంతని చెప్పేము నేము ఇవిగో మీ గుణములు
ఇంతా నీ వెరిగినదే ఇంటికి రావయ్యా
(॥ఎంత॥)
రాసులౌను మీఁది మీఁది రచ్చలో మాప్రియములు
ఆసలు వుట్టించు వినయము లైతేను
నేసిన నేఁతలై మించు నెరజాణతనములు
యీ సుద్దల కోపితేను ఇంటికి రావయ్యా
(॥ఎంత॥)
వుట్టిపడుఁ దేనియలు వూరకే మామాటలు
చుట్టుకొను వలపులు చూడఁగానే
బట్టబయలీఁదించు పరగఁ జక్కఁదనాలు
ఇట్టె ఇంత కోపితేను ఇంటికి రావయ్యా
(॥ఎంత॥)
కురిఇంచు మదములు కూడిన మా కాఁగిళ్లు
గరిమలఁ దమిరేఁచు కనుసన్నలు
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యిరవైతి నోపితే నీవింటికి రావయ్యా
(||pallavi||)
ĕṁtani sĕppemu nemu ivigo mī guṇamulu
iṁtā nī vĕriginade iṁṭigi rāvayyā
(||ĕṁta||)
rāsulaunu mīm̐di mīm̐di rachchalo māpriyamulu
āsalu vuṭṭiṁchu vinayamu laidenu
nesina nem̐talai miṁchu nĕrajāṇadanamulu
yī suddala kobidenu iṁṭigi rāvayyā
(||ĕṁta||)
vuṭṭibaḍum̐ deniyalu vūrage māmāḍalu
suṭṭugŏnu valabulu sūḍam̐gāne
baṭṭabayalīm̐diṁchu paragam̐ jakkam̐danālu
iṭṭĕ iṁta kobidenu iṁṭigi rāvayyā
(||ĕṁta||)
kuriiṁchu madamulu kūḍina mā kām̐giḽlu
garimalam̐ damirem̐su kanusannalu
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yiravaidi nobide nīviṁṭigi rāvayyā