ఎంతని చెప్పేమయ్య ఇంతి నీపైఁ గల బత్తి
(॥పల్లవి॥)
ఎంతని చెప్పేమయ్య ఇంతి నీపైఁ గల బత్తి
మంతుకెక్క నాపెను మన్నించు మిపుడు
(॥ఎంత॥)
సన్నపుటెఁలుగునను సతి నిన్నుఁ బాడిపాడి
కిన్నెర వాయించీఁ గిలకిల నవ్వుతా
వెన్నెలబాయిటనుండి వేడుకతో నీకతలు
కన్నవారికెల్లాఁ జెప్పి కడుఁబొగడీని
(॥ఎంత॥)
పాటించి నీరూపము పలకపై వాసుకొంటా
మేటినీసుద్దు లడిగీ మెలుఁతలను
కోటిసేసీ నీగుణాలు కోరికోరి మెచ్చుకొంటా
నీటునఁ బద్యాలు చెప్పీ నీమీఁదను
(॥ఎంత॥)
తలపోసితలపొసి తనివిదీరక నిన్నుఁ
గలసీ మనసునను కరఁగుచును
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
చెలిని నీవేలఁగాను సేసలు చల్లీని
(||pallavi||)
ĕṁtani sĕppemayya iṁti nībaim̐ gala batti
maṁtugĕkka nābĕnu manniṁchu mibuḍu
(||ĕṁta||)
sannabuḍĕm̐lugunanu sadi ninnum̐ bāḍibāḍi
kinnĕra vāyiṁchīm̐ gilagila navvudā
vĕnnĕlabāyiḍanuṁḍi veḍugado nīgadalu
kannavārigĕllām̐ jĕppi kaḍum̐bŏgaḍīni
(||ĕṁta||)
pāḍiṁchi nīrūbamu palagabai vāsugŏṁṭā
meḍinīsuddu laḍigī mĕlum̐talanu
koḍisesī nīguṇālu korigori mĕchchugŏṁṭā
nīḍunam̐ badyālu sĕppī nīmīm̐danu
(||ĕṁta||)
talabosidalabŏsi tanividīraga ninnum̐
galasī manasunanu karam̐gusunu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
sĕlini nīvelam̐gānu sesalu sallīni