ఎంతని పొగడేము నే మింతిభావములు నీతో
(॥పల్లవి॥)
ఎంతని పొగడేము నే మింతిభావములు నీతో
చెంతఁ దెరలో నున్నది చిత్తగించు మీకెను
(॥॥)
విన్నవించనేమిటికి వెలఁదిజవ్వనములు
చన్నులే చెప్పీఁగాక సారె సారెకు
పన్ని చక్కఁ దనములు పచారించనేమిటికి
కన్నులతీరులోనే కానవచ్చీ నీకును
(॥॥)
వ్రాసిచూపనేమిటికి వనితవొడ్డుఁ బొడవు
సేసనెట్టఁ గానే నీవు చేరి మేచ్చేవు
ఆసవుట్టించనేఁటికి ఆపెగుణా లిట్టివని
చేసేపూడిగాలకు సంతోసించేవు నీవు
(॥॥)
తెలపఁ గనేమిటికి తెఱవమోహము నీకు
తలిరుఁ బోడిఁ జూచితే దయవుట్టీని
అల మేలుమంగపతివయిన శ్రీవేంకటేశ్వర
కలసితి వెంచనేల కాఁగిట నీకున్నది
(||pallavi||)
ĕṁtani pŏgaḍemu ne miṁtibhāvamulu nīdo
sĕṁtam̐ dĕralo nunnadi sittagiṁchu mīgĕnu
(||||)
vinnaviṁchanemiḍigi vĕlam̐dijavvanamulu
sannule sĕppīm̐gāga sārĕ sārĕgu
panni sakkam̐ danamulu pasāriṁchanemiḍigi
kannuladīrulone kānavachchī nīgunu
(||||)
vrāsisūbanemiḍigi vanidavŏḍḍum̐ bŏḍavu
sesanĕṭṭam̐ gāne nīvu seri mechchevu
āsavuṭṭiṁchanem̐ṭigi ābĕguṇā liṭṭivani
sesebūḍigālagu saṁtosiṁchevu nīvu
(||||)
tĕlabam̐ ganemiḍigi tĕṟavamohamu nīgu
talirum̐ boḍim̐ jūside dayavuṭṭīni
ala melumaṁgabadivayina śhrīveṁkaḍeśhvara
kalasidi vĕṁchanela kām̐giḍa nīgunnadi