ఎంతని పొగడేమే నీ యిటువంటి సుద్దులు
(॥పల్లవి॥)
ఎంతని పొగడేమే నీ యిటువంటి సుద్దులు
వంతులకు సవతులవంటిదానవా
(॥॥)
తేనెలువంటి మాటలు తేటలుగా విభునికి
కానికె వట్టితివౌనే కలికి
మోనముననుండి కొంత ముగుదతనాననే
సోన గురియించితివే జోరున వలపులు
(॥॥)
కప్పురమువంటి నవ్వు కందువగా నప్పటిని
కప్పము లిచ్చితివౌనే కాంతునికి
చప్పుడు సేయక కొంత సాదుఁదనాననే
లప్పలు రాలించితివే లావుగాఁ బ్రియములు
(॥॥)
కుంకుమవంటి చూపు గురుతుగా నిప్పుడే
వుంకువ లిచ్చితివే నీ వొయడనికి
అంకెల శ్రీవేంకటేశుఁ డాతఁడే నన్నిటు గూడె
పొంకాన మెప్పించితివే భోగపు నీమేకులు
(||pallavi||)
ĕṁtani pŏgaḍeme nī yiḍuvaṁṭi suddulu
vaṁtulagu savadulavaṁṭidānavā
(||||)
tenĕluvaṁṭi māḍalu teḍalugā vibhunigi
kānigĕ vaṭṭidivaune kaligi
monamunanuṁḍi kŏṁta mugudadanānane
sona guriyiṁchidive joruna valabulu
(||||)
kappuramuvaṁṭi navvu kaṁduvagā nappaḍini
kappamu lichchidivaune kāṁtunigi
sappuḍu seyaga kŏṁta sādum̐danānane
lappalu rāliṁchidive lāvugām̐ briyamulu
(||||)
kuṁkumavaṁṭi sūbu gurudugā nippuḍe
vuṁkuva lichchidive nī vŏyaḍanigi
aṁkĕla śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe nanniḍu gūḍĕ
pŏṁkāna mĕppiṁchidive bhogabu nīmegulu