Emtani pogadavachchu niddari meebhaavamulu

ఎంతని పొగడవచ్చు నిద్దరి మీభావములు
Language

(॥పల్లవి॥)
ఎంతని పొగడవచ్చు నిద్దరి మీభావములు
సంతోసాలు పలుమారు జడిసీ మాకు

(॥ఎంత॥)
కరికితనము నీపై కాంత వెదచల్లఁగాను
సెలవుల చిరునవ్వు చిందీ నీకు
బలిమిఁ జన్నులమీఁది పయ్య దాపె జారించఁగా
మెలుపుఁ గోరిక లెల్లా మించీ నీకు

(॥ఎంత॥)
సరసపుసన్నలు సతి నీకుఁ జేయఁగాను
గరుపారీఁ జెక్కులఁ గమ్మటి నీకు
తిరమై యాకెమోవిఁ దేనెలు గారఁగాను
సురతపుఁగాంక్షలు చుట్టుకొనీ నీకు

(॥ఎంత॥)
కన్నులచూపువెన్నెల కాంత నీపైఁ బోయఁగాను
చిన్నిచెమటలు మేనఁ జెలఁగీ నీకు
యిన్నిటా శ్రీవేంకటేశ యీకె నిన్నుఁగూడఁ గాను
వున్నతి జవ్వనమద ముబ్బీ నీకు

(||pallavi||)
ĕṁtani pŏgaḍavachchu niddari mībhāvamulu
saṁtosālu palumāru jaḍisī māgu

(||ĕṁta||)
karigidanamu nībai kāṁta vĕdasallam̐gānu
sĕlavula sirunavvu siṁdī nīgu
balimim̐ jannulamīm̐di payya dābĕ jāriṁcham̐gā
mĕlubum̐ goriga lĕllā miṁchī nīgu

(||ĕṁta||)
sarasabusannalu sadi nīgum̐ jeyam̐gānu
garubārīm̐ jĕkkulam̐ gammaḍi nīgu
tiramai yāgĕmovim̐ denĕlu gāram̐gānu
suradabum̐gāṁkṣhalu suṭṭugŏnī nīgu

(||ĕṁta||)
kannulasūbuvĕnnĕla kāṁta nībaim̐ boyam̐gānu
sinnisĕmaḍalu menam̐ jĕlam̐gī nīgu
yinniḍā śhrīveṁkaḍeśha yīgĕ ninnum̐gūḍam̐ gānu
vunnadi javvanamada mubbī nīgu