Emtani pogadavachchu niddari mee neruvulu

ఎంతని పొగడవచ్చు నిద్దరి మీ నేరువులు
Language

(॥పల్లవి॥)
ఎంతని పొగడవచ్చు నిద్దరి మీ నేరువులు
సంతోసములాయ సతులకెల్లాను

(॥ఎంత॥)
చనవు గలిగితేను చవులు దానె పుట్టు
మనసు లెనసితెమ మర్మములంటు
యెనసివుండితేను ఇంపులును దైవారు
కనుఁగొంటే మీయందే కలిగె నీగుణాలు

(॥ఎంత॥)
మచ్చికలు సతమైతే మమతలు నెలకొను
ముచ్చటలాడినచోట మోహలు రేఁగు
కుచ్చికుచ్చి పెనఁగితే గుబ్బతిలుఁ దమకము
మెచ్చులుగా యీసుద్దులు మీయందే వింటిమి

(॥ఎంత॥)
విందు లొనగూడితెను వేడుకలు వెలవెట్టు
కందువ సమరతులు కడుఁ జోక్కించు
చెంది యలమేల్‌మంగవు శ్రీవేంకటేశుం డితఁడు
పొందులు మీయందే ఇపుడు దెలిసితిమి

(||pallavi||)
ĕṁtani pŏgaḍavachchu niddari mī neruvulu
saṁtosamulāya sadulagĕllānu

(||ĕṁta||)
sanavu galigidenu savulu dānĕ puṭṭu
manasu lĕnasidĕma marmamulaṁṭu
yĕnasivuṁḍidenu iṁpulunu daivāru
kanum̐gŏṁṭe mīyaṁde kaligĕ nīguṇālu

(||ĕṁta||)
machchigalu sadamaide mamadalu nĕlagŏnu
muchchaḍalāḍinasoḍa mohalu rem̐gu
kuchchiguchchi pĕnam̐gide gubbadilum̐ damagamu
mĕchchulugā yīsuddulu mīyaṁde viṁṭimi

(||ĕṁta||)
viṁdu lŏnagūḍidĕnu veḍugalu vĕlavĕṭṭu
kaṁduva samaradulu kaḍum̐ jokkiṁchu
sĕṁdi yalamel‌maṁgavu śhrīveṁkaḍeśhuṁ ḍidam̐ḍu
pŏṁdulu mīyaṁde ibuḍu dĕlisidimi