Emtanerube neevu yenu nidamdu numdamga

ఎంతనేరుపే నీవు యేను నితఁడు నుండఁగ
Language

(॥పల్లవి॥)
ఎంతనేరుపే నీవు యేను నితఁడు నుండఁగ
కొఁ(కొం?)తైనా సిగ్గువడవు కొసరేవు నీవు

(॥ఎంత॥)
చెలికతైమాటునను చిఱునవ్వు నవ్వుకొంటా
యెలయించ వచ్చితివా యీతని నీవు
సోలసిసొలసి చూచి సొంపులెల్లా రేఁచుకొంటా
వలపించేనంటాను వచ్చితివా నీవు

(॥ఎంత॥)
సోమ్ములెల్లా బెట్టుకొని సొరిది సింగారించుక
యెమ్మెచూపవచ్చితివా యీతనికిని
సమ్మతి నూరఁగలసరసము లాడుకొంటా
కిమ్ముల నిలుచుండి చొక్కించఁగ వచ్చితివా

(॥ఎంత॥)
కందువఁ బయ్యద జార కడుమురుసుకొంటాను
పొందుసేయవచ్చితివా పొంది యీతని
అందపు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవిభుఁడు
ముందే నన్నేలె నితనిమోహాన వచ్చితివా

(||pallavi||)
ĕṁtanerube nīvu yenu nidam̐ḍu nuṁḍam̐ga
kŏm̐(kŏṁ?)tainā sigguvaḍavu kŏsarevu nīvu

(||ĕṁta||)
sĕligadaimāḍunanu siṟunavvu navvugŏṁṭā
yĕlayiṁcha vachchidivā yīdani nīvu
solasisŏlasi sūsi sŏṁpulĕllā rem̐sugŏṁṭā
valabiṁchenaṁṭānu vachchidivā nīvu

(||ĕṁta||)
sommulĕllā bĕṭṭugŏni sŏridi siṁgāriṁchuga
yĕmmĕsūbavachchidivā yīdanigini
sammadi nūram̐galasarasamu lāḍugŏṁṭā
kimmula nilusuṁḍi sŏkkiṁcham̐ga vachchidivā

(||ĕṁta||)
kaṁduvam̐ bayyada jāra kaḍumurusugŏṁṭānu
pŏṁduseyavachchidivā pŏṁdi yīdani
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavibhum̐ḍu
muṁde nannelĕ nidanimohāna vachchidivā