Emtamelu gattugonnaa yide nee sittamu koddi

ఎంతమేలు గట్టుకొన్నా యిదె నీ చిత్తము కొద్ది
Language

(॥పల్లవి॥)
ఎంతమేలు గట్టుకొన్నా యిదె నీ చిత్తము కొద్ది
సంతోసములెల్లానాయ సమ్మతించే నిఁకను

(॥ఎంత॥)
నన్ను నీ వెఱుఁగుదువు నాకు నీపై బత్తి గద్దు
విన్నవించ నేమున్నది వేఁగినంతాను
మన్నించితి వన్నిటాను మనసొక్కటాయ నేఁడు
సన్నల నేమి సేసినా సమ్మతించే నిఁకను

(॥ఎంత॥)
యేలుకొంటి విటు నన్ను ఇన్నిటా నమ్మితి నిన్ను
జోలితోఁ బెనఁగనేల చుట్టి చుట్టి
లాలన మీవల్లఁ గద్దు లాగాయ నా బతుకిది
చాలా నీ పొందుల కెల్లా సమ్మతించే నిఁకను

(॥ఎంత॥)
నీవు నన్నుఁ గూడితవి నేఁ దొల్లె నీ సొమ్మనయితి
వావులు చెప్పఁగనేల వరుసతోను
శ్రీ వేంకటేశ నీకు చెలఁగి దేవుల నైతి
సావి వోరాదు వలపు సమ్మతించే నిఁకను

(||pallavi||)
ĕṁtamelu gaṭṭugŏnnā yidĕ nī sittamu kŏddi
saṁtosamulĕllānāya sammadiṁche nim̐kanu

(||ĕṁta||)
nannu nī vĕṟum̐guduvu nāgu nībai batti gaddu
vinnaviṁcha nemunnadi vem̐ginaṁtānu
manniṁchidi vanniḍānu manasŏkkaḍāya nem̐ḍu
sannala nemi sesinā sammadiṁche nim̐kanu

(||ĕṁta||)
yelugŏṁṭi viḍu nannu inniḍā nammidi ninnu
jolidom̐ bĕnam̐ganela suṭṭi suṭṭi
lālana mīvallam̐ gaddu lāgāya nā badugidi
sālā nī pŏṁdula kĕllā sammadiṁche nim̐kanu

(||ĕṁta||)
nīvu nannum̐ gūḍidavi nem̐ dŏllĕ nī sŏmmanayidi
vāvulu sĕppam̐ganela varusadonu
śhrī veṁkaḍeśha nīgu sĕlam̐gi devula naidi
sāvi vorādu valabu sammadiṁche nim̐kanu