Emtaledu yiveem gonni yemtigi mee tachchanalu

ఎంతలేదు యివీఁ గొన్ని యేఁటికి మీ తచ్చనలు
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు యివీఁ గొన్ని యేఁటికి మీ తచ్చనలు
ఇంతయు నెరిఁగితిమి ఇఁక మన్నించరయ్యా

(॥ఎంత॥)
పొద్దువోక మీరెంతేసి బొమ్మల జంకించుకొన్నా-
నిద్దరూ నొక్కటేకాక యెరవయ్యేరా
వుద్దండాన నప్పటిని వొడివట్టి పెనఁగినా
పెద్దకారిలకేకాక బిరుదు లెక్కించేరా

(॥ఎంత॥)
వొరసి మీరెంతేసి వొట్లు వెట్టుకొనినా
సరసము లింతేకాక చలపట్టేరా
గొరభై మీలోమీరే కొచ్చికొచ్చి చూచుకొన్నా
తరితీపు లింతేకాక తప్పులు వట్టేరా

(॥ఎంత॥)
పంతాన మీరెంతేసిచేపట్లకుఁ జేరినాను
దొరతిఁ గాంగిటికేకాక దొమ్మిసేసేరా
చెంత మమ్ము నేలితివి శ్రీవేంకటేశుఁడ నేఁడు
యింతి యీకె కొసరుఁగా కింకాం గొత్తలయ్యేరా

(||pallavi||)
ĕṁtaledu yivīm̐ gŏnni yem̐ṭigi mī tachchanalu
iṁtayu nĕrim̐gidimi im̐ka manniṁcharayyā

(||ĕṁta||)
pŏdduvoga mīrĕṁtesi bŏmmala jaṁkiṁchugŏnnā-
niddarū nŏkkaḍegāga yĕravayyerā
vuddaṁḍāna nappaḍini vŏḍivaṭṭi pĕnam̐ginā
pĕddagārilagegāga birudu lĕkkiṁcherā

(||ĕṁta||)
vŏrasi mīrĕṁtesi vŏṭlu vĕṭṭugŏninā
sarasamu liṁtegāga salabaṭṭerā
gŏrabhai mīlomīre kŏchchigŏchchi sūsugŏnnā
taridību liṁtegāga tappulu vaṭṭerā

(||ĕṁta||)
paṁtāna mīrĕṁtesisebaṭlagum̐ jerinānu
dŏradim̐ gāṁgiḍigegāga dŏmmiseserā
sĕṁta mammu nelidivi śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ḍu
yiṁti yīgĕ kŏsarum̐gā kiṁkāṁ gŏttalayyerā