Emtaledu tana suddu leramgamaa nemellaa

ఎంతలేదు తన సుద్దు లెరఁగమా నేమెల్లా
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు తన సుద్దు లెరఁగమా నేమెల్లా
ఇంతులాల చూడరమ్మ యిటువంటి కొత్తలు

(॥ఎంత॥)
వాసిగల సతియైతే వలపు చెప్పుకొనునా
వేసా లింతేకాక విభునితోను
పాసి వుండలేనిదైతే పంతములు నెరపునా
ఆసతో వేళ గాచుక అట్టె వుండుఁగాక

(॥ఎంత॥)
ఇంతబత్తి గలిగితే నెడమాట లాడించునా
వంతుల నింటికిఁ దానే వచ్చుఁగాక
చెంతఁ దొల్లిటి పొందైతే సిగ్గులూఁ దాఁబడునా
బంతినున్న సవతుల బ్రమయించీఁ గాక

(॥ఎంత॥)
యితవరి యైతేను యెగ్గులు దాఁబట్టునా
మతకమేమోకాక మాటి మాటికి
అతఁడు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
సతమై నన్నుఁ గూడఁగా సమ్మతించితిఁగాక

(||pallavi||)
ĕṁtaledu tana suddu lĕram̐gamā nemĕllā
iṁtulāla sūḍaramma yiḍuvaṁṭi kŏttalu

(||ĕṁta||)
vāsigala sadiyaide valabu sĕppugŏnunā
vesā liṁtegāga vibhunidonu
pāsi vuṁḍalenidaide paṁtamulu nĕrabunā
āsado veḽa gāsuga aṭṭĕ vuṁḍum̐gāga

(||ĕṁta||)
iṁtabatti galigide nĕḍamāḍa lāḍiṁchunā
vaṁtula niṁṭigim̐ dāne vachchum̐gāga
sĕṁtam̐ dŏlliḍi pŏṁdaide siggulūm̐ dām̐baḍunā
baṁtinunna savadula bramayiṁchīm̐ gāga

(||ĕṁta||)
yidavari yaidenu yĕggulu dām̐baṭṭunā
madagamemogāga māḍi māḍigi
adam̐ḍu śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
sadamai nannum̐ gūḍam̐gā sammadiṁchidim̐gāga