Emtaledu suttariga mekkada soosinaa neegu

ఎంతలేదు చుట్టరిక మెక్కడ చూచినా నీకు
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు చుట్టరిక మెక్కడ చూచినా నీకు
మంతుకెక్కఁగ నా మాఁట మన్నించి రావయా

(॥ఎంత॥)
విందుచెప్పి యాపె నీకు వేళగాచుక వుండఁగా
ఇందువచ్చి జూజాలు నీవేమాడేవు
పొందు లెన్నైనాఁ గలవు పూఁచి నివు వెదకితే
ఇందుముఖి యాన నీకు ఇట్టే లేచి రావయా

(॥ఎంత॥)
ఇంతి నీకుఁ బోఁకవట్టి యెదురెదురే చూడఁగ
పంతాన నిక్కడకు వచ్చి పాట వినేవు
వింతలైన వద్యలకు వేడకకాఁడ వౌదువు
దొంతుల నాకెపై యాన తోయకిట్టె రావయా

(॥ఎంత॥)
వరుసకు వచ్చి యాపె వాకిట నిలుచుండఁగా
పొరుగువారితో నెంత పొద్దు సేసేవు
ఇరవై శ్రీవేంకటేశ యేలితి వింటికి వచ్చి
తరుణిపై యాక లిఁక దాఁట కిట్టె రావయా

(||pallavi||)
ĕṁtaledu suṭṭariga mĕkkaḍa sūsinā nīgu
maṁtugĕkkam̐ga nā mām̐ṭa manniṁchi rāvayā

(||ĕṁta||)
viṁdusĕppi yābĕ nīgu veḽagāsuga vuṁḍam̐gā
iṁduvachchi jūjālu nīvemāḍevu
pŏṁdu lĕnnainām̐ galavu pūm̐si nivu vĕdagide
iṁdumukhi yāna nīgu iṭṭe lesi rāvayā

(||ĕṁta||)
iṁti nīgum̐ bom̐kavaṭṭi yĕdurĕdure sūḍam̐ga
paṁtāna nikkaḍagu vachchi pāḍa vinevu
viṁtalaina vadyalagu veḍagagām̐ḍa vauduvu
dŏṁtula nāgĕbai yāna toyagiṭṭĕ rāvayā

(||ĕṁta||)
varusagu vachchi yābĕ vāgiḍa nilusuṁḍam̐gā
pŏruguvārido nĕṁta pŏddu sesevu
iravai śhrīveṁkaḍeśha yelidi viṁṭigi vachchi
taruṇibai yāga lim̐ka dām̐ṭa kiṭṭĕ rāvayā