Emtaledu rammanave yela vesaalu seseeni

ఎంతలేదు రమ్మనవే యేల వేసాలు సేసీని
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు రమ్మనవే యేల వేసాలు సేసీని
పంతగాఁడై వూరకుంటే పచారించేరా

(॥॥)
అలయనేలే తాను ఆసురుసు రననేలే
నలినాక్షి తనతోఁబెనఁగులాడితే
వలవఁగ నింతేసి వచ్చెఁగాక అటు తాను
తొలుతే సాజాన నుంటే దొమ్మిసేసేరా

(॥॥)
సిగ్గులు వడఁగనేలే సెలవుల నవ్వనేలే
నిగ్గులను వసంతపునీరు చల్లితే
బగ్గన తా వచ్చి వొడివట్టి తియ్యఁగానేకాక
వొగ్గి గుట్టుననుండితే నొలవేసేరా

(॥॥)
మేనిమురిపెములేలే మేకులు చూపఁగనేలే
ఆనుక తనకాఁగిట నాపె గూడఁగా
యీనెపము శ్రీ వేంకటేశుఁడు తాఁ జెసెఁగాక
మోనాన వాసితో నుంటే మొరయవచ్చేరా

(||pallavi||)
ĕṁtaledu rammanave yela vesālu sesīni
paṁtagām̐ḍai vūraguṁṭe pasāriṁcherā

(||||)
alayanele tānu āsurusu rananele
nalinākṣhi tanadom̐bĕnam̐gulāḍide
valavam̐ga niṁtesi vachchĕm̐gāga aḍu tānu
tŏlude sājāna nuṁṭe dŏmmiseserā

(||||)
siggulu vaḍam̐ganele sĕlavula navvanele
niggulanu vasaṁtabunīru sallide
baggana tā vachchi vŏḍivaṭṭi tiyyam̐gānegāga
vŏggi guṭṭunanuṁḍide nŏlaveserā

(||||)
menimuribĕmulele megulu sūbam̐ganele
ānuga tanagām̐giḍa nābĕ gūḍam̐gā
yīnĕbamu śhrī veṁkaḍeśhum̐ḍu tām̐ jĕsĕm̐gāga
monāna vāsido nuṁṭe mŏrayavachcherā