(॥పల్లవి॥)
ఎంతలేదు రమణుని యేలాటాలు
పంతపుమాఁటల కెల్లా బారలు చాఁచేవా
(॥ఎంత॥)
చెలువుఁడు నవ్వుతాను చేఁతలేమో సేసెనంటా
చలములు నీవేల సాదించేవే
జలజలమనుచును జడివాన గురిసితే
కలచోటికెల్లా నీవు కట్టలు గట్టేవా
(॥ఎంత॥)
రమణుఁడు వేడుకతో రవళించి తిట్టెనంటా
గమకాననంత యేల కాఁతాళించేవే
సమముగా నంతటా వేసవి యెండగాసితేను
భ్రమసి యేడనేడకై పందిళ్ళువెట్టేవా
(॥ఎంత॥)
శ్రీవేంకటేశుఁడు నిన్ను చెంగలించి కూడితేను
ఆవేళ నీవేల వుసురసు రనేవే
కావరించి పొలమెల్లా గాలి విసరితేను
దావతి నెందుఁజూచినా దళ్లుగట్టేవా
(||pallavi||)
ĕṁtaledu ramaṇuni yelāḍālu
paṁtabumām̐ṭala kĕllā bāralu sām̐sevā
(||ĕṁta||)
sĕluvum̐ḍu navvudānu sem̐talemo sesĕnaṁṭā
salamulu nīvela sādiṁcheve
jalajalamanusunu jaḍivāna guriside
kalasoḍigĕllā nīvu kaṭṭalu gaṭṭevā
(||ĕṁta||)
ramaṇum̐ḍu veḍugado ravaḽiṁchi tiṭṭĕnaṁṭā
gamagānanaṁta yela kām̐tāḽiṁcheve
samamugā naṁtaḍā vesavi yĕṁḍagāsidenu
bhramasi yeḍaneḍagai paṁdiḽḽuvĕṭṭevā
(||ĕṁta||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnu sĕṁgaliṁchi kūḍidenu
āveḽa nīvela vusurasu raneve
kāvariṁchi pŏlamĕllā gāli visaridenu
dāvadi nĕṁdum̐jūsinā daḽlugaṭṭevā