Emtaledu paraagu neegeboddunu

ఎంతలేదు పరాకు నీకేపొద్దును
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు పరాకు నీకేపొద్దును
వింతొకచూపు మరి వేఁడొకచవెందురు

(॥॥)
వేడుకతోడుత నీకు విన్నపాలు సేయవచ్చె
ఆడరాదా కతము లాపెతోడను
తోడనే సింగారించుక తొంగిచూచీ నల్లదివో
చూడరాదా యాదిక్కు జోడుగా నీవు

(॥॥)
విందుగాఁ బయ్యదలోన వెస నేమో మూసితెచ్చెఁ-
నందుకోరాదా లోన నాపెచేతను
పొందుగాఁ గొలువుసేసి పూనుకొని యెదుటనె
చెంది వూడిగ మేమైనాఁ జేయించుకొనరాదా

(॥॥)
వినోదానఁ దా నేర్చిన విద్యలు చూపఁ గడఁగీ
మనసారఁ జూడరాదా మాఁటున నుండి
యెనసితివి శ్రీ వేంకటేశ యింన్నిటా నన్ను
పెనఁగి యాపెవలపుఁ బెడరేఁ చరాదా

(||pallavi||)
ĕṁtaledu parāgu nīgebŏddunu
viṁtŏgasūbu mari vem̐ḍŏgasavĕṁduru

(||||)
veḍugadoḍuda nīgu vinnabālu seyavachchĕ
āḍarādā kadamu lābĕdoḍanu
toḍane siṁgāriṁchuga tŏṁgisūsī nalladivo
sūḍarādā yādikku joḍugā nīvu

(||||)
viṁdugām̐ bayyadalona vĕsa nemo mūsidĕchchĕm̐-
naṁdugorādā lona nābĕsedanu
pŏṁdugām̐ gŏluvusesi pūnugŏni yĕduḍanĕ
sĕṁdi vūḍiga memainām̐ jeyiṁchugŏnarādā

(||||)
vinodānam̐ dā nersina vidyalu sūbam̐ gaḍam̐gī
manasāram̐ jūḍarādā mām̐ṭuna nuṁḍi
yĕnasidivi śhrī veṁkaḍeśha yiṁnniḍā nannu
pĕnam̐gi yābĕvalabum̐ bĕḍarem̐ sarādā