Emtaledu neebatti yeramgaraa yimdarunu

ఎంతలేదు నీబత్తి యెరఁగరా యిందరును
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు నీబత్తి యెరఁగరా యిందరును
దొంతిఁబెట్టేవు ప్రియాలు దొరకుదాఁకాను

(॥ఎంత॥)
పొరుగాపెపై వలపు పూనేవు నామీఁద
వరుసల వద్ది కాపె వచ్చుదాఁకాను
సరుస నావంక నీవు చక్కఁ జూచే వప్పటిని
అరసి యవ్వలిపొందు అదనౌదాఁకాను

(॥ఎంత॥)
కడవారిపొందు నాతోఁ గసి వుచ్చు‌కొనే విట్టే
అడరి వారితో మాఁట లందుదాఁకాను
నడుమ నవ్వులెల్లాను నవ్వేవు యీవేళను
వుడివోనియట్టి కాఁగి లొనరుదాఁకాను

(॥ఎంత॥)
పోరచి వనితమారు పొదిగేవు నన్ను నిట్టే
చేరి యాపె నిన్నుఁ గూడి చెలఁగుదాఁకా
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కోరికె లన్నియునుఁ జేకూరుదాఁకాను

(||pallavi||)
ĕṁtaledu nībatti yĕram̐garā yiṁdarunu
dŏṁtim̐bĕṭṭevu priyālu dŏragudām̐kānu

(||ĕṁta||)
pŏrugābĕbai valabu pūnevu nāmīm̐da
varusala vaddi kābĕ vachchudām̐kānu
sarusa nāvaṁka nīvu sakkam̐ jūse vappaḍini
arasi yavvalibŏṁdu adanaudām̐kānu

(||ĕṁta||)
kaḍavāribŏṁdu nādom̐ gasi vuchchu‌kŏne viṭṭe
aḍari vārido mām̐ṭa laṁdudām̐kānu
naḍuma navvulĕllānu navvevu yīveḽanu
vuḍivoniyaṭṭi kām̐gi lŏnarudām̐kānu

(||ĕṁta||)
porasi vanidamāru pŏdigevu nannu niṭṭe
seri yābĕ ninnum̐ gūḍi sĕlam̐gudām̐kā
yīrīdi śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
korigĕ lanniyunum̐ jegūrudām̐kānu