Emtaledu neebagadu yemdaagaane

ఎంతలేదు నీపగటు యెందాకానే
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు నీపగటు యెందాకానే
కాంతుని కిచ్చకమాడి కలయఁగరాదా

(॥॥)
వేడుకకు రమణుఁడు వేమారు నవ్వితేను
జాడెఱఁగక బొమ్మల జంకించేవే
యీడువెట్టి వేరోక్కతె నింటికిఁ దెచ్చుకొంటే
పాడిదప్పి నీ సం పై వచ్చెనటే

(॥॥)
చెలరేఁగి యాతఁడు చెనకి చన్నులంటితే
పెలుచవై సారెనేల పెనఁగేవే
కొలువులోపలనున్న కొమ్మలఁ గాఁగిలించితే
చలపట్టి నీవుమరి సాదించేవటే

(॥॥)
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేరి యిట్టె కూడితేను
ఆవటించి రతినెంత ఆలయించేవే
కావరించి పూడిగపుకాంతలతోఁ జెప్పితేను
తావుకొన్న నీవలపు దాఁచేవటే

(||pallavi||)
ĕṁtaledu nībagaḍu yĕṁdāgāne
kāṁtuni kichchagamāḍi kalayam̐garādā

(||||)
veḍugagu ramaṇum̐ḍu vemāru navvidenu
jāḍĕṟam̐gaga bŏmmala jaṁkiṁcheve
yīḍuvĕṭṭi verokkadĕ niṁṭigim̐ dĕchchugŏṁṭe
pāḍidappi nī saṁ pai vachchĕnaḍe

(||||)
sĕlarem̐gi yādam̐ḍu sĕnagi sannulaṁṭide
pĕlusavai sārĕnela pĕnam̐geve
kŏluvulobalanunna kŏmmalam̐ gām̐giliṁchide
salabaṭṭi nīvumari sādiṁchevaḍe

(||||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jeri yiṭṭĕ kūḍidenu
āvaḍiṁchi radinĕṁta ālayiṁcheve
kāvariṁchi pūḍigabugāṁtaladom̐ jĕppidenu
tāvugŏnna nīvalabu dām̐sevaḍe