Emtaledu nee yaasoda memiseppedi

ఎంతలేదు నీ యాసోద మేమిచెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు నీ యాసోద మేమిచెప్పేది
చెంతనుండి నామీఁదఁ జేయి చాఁచేవు

(॥॥)
వొక్కతెతో మాటాడుతా నొక్కతెతో నవ్వేవు
అక్కర నొకతె వీడె మడిగేవు
వుక్కుమీరి వొక్కతెను వొడివట్టి తీసేవు
మక్కువ నప్పటిని నామర్మము లంటేవు

(॥॥)
చెయివట్టే వీకెను చేసన్న సేసే వాకెను
పాయఁజాల కిల్లీ కెకుఁ బనిచెప్పేవు
చాయల నల్లాకెతోడ సరసము లాడేవు
సోయగాన నాకప్పటి సొమ్ము లిచ్చేవు

(॥॥)
యెవ్వతెనో పేరఁ బిల్చి యెవ్వతెనో కూడేవు
దవ్వుల నదెవ్వతెనో తలపోసేవు
రవ్వగా శ్రీ వేంకటేశ కత నన్నుఁ జెలగించి
చివ్వన నప్పటి నవ్వే చేరికూడేవు

(||pallavi||)
ĕṁtaledu nī yāsoda memisĕppedi
sĕṁtanuṁḍi nāmīm̐dam̐ jeyi sām̐sevu

(||||)
vŏkkadĕdo māḍāḍudā nŏkkadĕdo navvevu
akkara nŏgadĕ vīḍĕ maḍigevu
vukkumīri vŏkkadĕnu vŏḍivaṭṭi tīsevu
makkuva nappaḍini nāmarmamu laṁṭevu

(||||)
sĕyivaṭṭe vīgĕnu sesanna sese vāgĕnu
pāyam̐jāla killī kĕgum̐ banisĕppevu
sāyala nallāgĕdoḍa sarasamu lāḍevu
soyagāna nāgappaḍi sŏmmu lichchevu

(||||)
yĕvvadĕno peram̐ bilsi yĕvvadĕno kūḍevu
davvula nadĕvvadĕno talabosevu
ravvagā śhrī veṁkaḍeśha kada nannum̐ jĕlagiṁchi
sivvana nappaḍi navve serigūḍevu