Emtaledu nee yaasoda memiseppedi

ఎంతలేదు నీ యాసోద మేమిచెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు నీ యాసోద మేమిచెప్పేది
బంతినుఁడి రతులకే బాఁతిపడేవు

(॥॥)
చెలులై తేఁజాలు నట్టె చేరి యెంతవడియైనా
మలసి మలసి నీవు మాటలడేవు
కొలఁదిమీరినయట్టి కుచములు గంటేఁజాలు
యెలమి నూరకయైనా యేఁకారేవు

(॥॥)
తప్పకఁ జూచితేఁజాలు తనియక మీఁద మీఁద
వుప్పతిలుఁదమకాన నోలలాడేవు
చిప్పిల నవ్వితేఁజాలు చెంతల నట్టె భ్రమసి
వొప్పగు మోవితేనెకు నొగి నోరూరేవు

(॥॥)
కాఁగిలించుకొంటేఁజాలు కడు సంతోసముతోడ
చేఁగదేరి వలపులు చిమ్మిరేఁగేవు
వీఁగక శ్రీవేంకటేశ వెస నన్నుఁ గూడితివి
పాఁగినతరితీపులఁ బచ్చిదేరేవు

(||pallavi||)
ĕṁtaledu nī yāsoda memisĕppedi
baṁtinum̐ḍi radulage bām̐tibaḍevu

(||||)
sĕlulai tem̐jālu naṭṭĕ seri yĕṁtavaḍiyainā
malasi malasi nīvu māḍalaḍevu
kŏlam̐dimīrinayaṭṭi kusamulu gaṁṭem̐jālu
yĕlami nūragayainā yem̐kārevu

(||||)
tappagam̐ jūsidem̐jālu taniyaga mīm̐da mīm̐da
vuppadilum̐damagāna nolalāḍevu
sippila navvidem̐jālu sĕṁtala naṭṭĕ bhramasi
vŏppagu movidenĕgu nŏgi norūrevu

(||||)
kām̐giliṁchugŏṁṭem̐jālu kaḍu saṁtosamudoḍa
sem̐gaderi valabulu simmirem̐gevu
vīm̐gaga śhrīveṁkaḍeśha vĕsa nannum̐ gūḍidivi
pām̐ginadaridībulam̐ bachchiderevu