Emtaledu naayaasa yemi seppenu

ఎంతలేదు నాయాస యేమి చెప్పేను
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు నాయాస యేమి చెప్పేను
పంతమున నీవల్ల బతు కెల్లాఁ గలది

(॥ఎంత॥)
నీచిత్తము నామీఁద నిజముగాఁ బారితేను
యేచిన నావలపెల్లా నీడేరును
పూచినపూవులలోన పూఁపలు బలువైతేనే
కాచినకాపెల్లా నట్టె కడుఫలియించును

(॥ఎంత॥)
చనవిచ్చి నీవు నాతో సరసములాడితేనే
యెనసిననాసేవ లీడేరును
వెనుకొన్నసంపదలు వెంట వెంటఁ దిరిగితే
యెనలేని రాజసము లింతా నీడేరును

(॥ఎంత॥)
సేసవెట్టినట్టె(ట్టి?) నీవు చెప్పినట్టు సేసితేను
వేసరనివాకాఁగిలి వేడుకలౌను
యీసులేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
లాసి నీటికొలఁదే లలితోఁ దామెరలూ

(||pallavi||)
ĕṁtaledu nāyāsa yemi sĕppenu
paṁtamuna nīvalla badu kĕllām̐ galadi

(||ĕṁta||)
nīsittamu nāmīm̐da nijamugām̐ bāridenu
yesina nāvalabĕllā nīḍerunu
pūsinabūvulalona pūm̐palu baluvaidene
kāsinagābĕllā naṭṭĕ kaḍuphaliyiṁchunu

(||ĕṁta||)
sanavichchi nīvu nādo sarasamulāḍidene
yĕnasinanāseva līḍerunu
vĕnugŏnnasaṁpadalu vĕṁṭa vĕṁṭam̐ dirigide
yĕnaleni rājasamu liṁtā nīḍerunu

(||ĕṁta||)
sesavĕṭṭinaṭṭĕ(ṭṭi?) nīvu sĕppinaṭṭu sesidenu
vesaranivāgām̐gili veḍugalaunu
yīsulega śhrīveṁkaḍeśha nannu nelidivi
lāsi nīḍigŏlam̐de lalidom̐ dāmĕralū