Emtaledu meemaadalu yemi seppere selulu

ఎంతలేదు మీమాటలు యేమి చెప్పేరే చెలులు
Language

(॥పల్లవి॥)
ఎంతలేదు మీమాటలు యేమి చెప్పేరే చెలులు
కాంతుఁ డీడకు వచ్చితేఁ గాదుగూడ దనేనా

(॥ఎంత॥)
వలుపే నిజమైతే వనితలతోడుత
చలము లెవ్వరైనాను సాదింతురా
వెలలేనిరాత్రుల వెన్నెల గాయునట
యెలమి నక్కడ వచ్చి యెండలుండునా

(॥ఎంత॥)
పొందు సేయవలసితే పొలఁతుల యడాటాన
యిందుముఖలను జూపి యెలయింతురా
కందువైన వసంతకాలమునందును
పొందుగానిజాజిపొదఁ బువ్వులుండునా

(॥ఎంత॥)
అట్టె శ్రీవెంకటేశుఁ డలమేల్ మంగను నేను
గుట్టున నన్నేలె నిఁక గురుతున్నదా
పట్టై కొలనిలో హంస పరగఁ జూపట్టినట్టు
యెట్టి పక్షులుండినాను యెన్నిక కెక్కీనా

(||pallavi||)
ĕṁtaledu mīmāḍalu yemi sĕppere sĕlulu
kāṁtum̐ ḍīḍagu vachchidem̐ gādugūḍa danenā

(||ĕṁta||)
valube nijamaide vanidaladoḍuda
salamu lĕvvarainānu sādiṁturā
vĕlalenirātrula vĕnnĕla gāyunaḍa
yĕlami nakkaḍa vachchi yĕṁḍaluṁḍunā

(||ĕṁta||)
pŏṁdu seyavalaside pŏlam̐tula yaḍāḍāna
yiṁdumukhalanu jūbi yĕlayiṁturā
kaṁduvaina vasaṁtagālamunaṁdunu
pŏṁdugānijājibŏdam̐ buvvuluṁḍunā

(||ĕṁta||)
aṭṭĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍalamel maṁganu nenu
guṭṭuna nannelĕ nim̐ka gurudunnadā
paṭṭai kŏlanilo haṁsa paragam̐ jūbaṭṭinaṭṭu
yĕṭṭi pakṣhuluṁḍinānu yĕnniga kĕkkīnā