Emtale devvarido neminana nemidige

ఎంతలే దెవ్వరితో నేమినన నేమిటికే
Language

(॥పల్లవి॥)
ఎంతలే దెవ్వరితో నేమినన నేమిటికే
చెంత నిట్టే వుండఁగానే చెలిమి సేసేరు

(॥ఎంత॥)
యేతులకు సవతులు యెంత వెంగేలాడినాను
అతడు నాకుఁగలం డందుకేమే
కాతరానఁ గొక్కెరలు కడురవళించినాను
అతలఁ గొలఁకులఁ దావై యుండవా యలులు

(॥ఎంత॥)
సందుసుడికత్తె లెంతసుణఁగులు రాలిచిన
యెందు నామాట మీరఁడు ఇల నాతఁడు
ముందే కోవిలలు వనముల రొదసేసితే
అందే చిలుకలు నిరవై యుండుఁగదవే

(॥ఎంత॥)
పొసఁగనివా రెంతపొరపొచ్చాలఁబోయిన
వెస సన్నేలెను శ్రీవేంకటేశుఁడు
యెగి యలమేల్‌మంగ నేను, కొండల నెమళ్లు
కోసరినాఁ బావురాలుకూడ నిట్టే వుండుఁగా

(||pallavi||)
ĕṁtale dĕvvarido neminana nemiḍige
sĕṁta niṭṭe vuṁḍam̐gāne sĕlimi seseru

(||ĕṁta||)
yedulagu savadulu yĕṁta vĕṁgelāḍinānu
adaḍu nāgum̐galaṁ ḍaṁdugeme
kādarānam̐ gŏkkĕralu kaḍuravaḽiṁchinānu
adalam̐ gŏlam̐kulam̐ dāvai yuṁḍavā yalulu

(||ĕṁta||)
saṁdusuḍigattĕ lĕṁtasuṇam̐gulu rālisina
yĕṁdu nāmāḍa mīram̐ḍu ila nādam̐ḍu
muṁde kovilalu vanamula rŏdaseside
aṁde silugalu niravai yuṁḍum̐gadave

(||ĕṁta||)
pŏsam̐ganivā rĕṁtabŏrabŏchchālam̐boyina
vĕsa sannelĕnu śhrīveṁkaḍeśhum̐ḍu
yĕgi yalamel‌maṁga nenu, kŏṁḍala nĕmaḽlu
kosarinām̐ bāvurālugūḍa niṭṭe vuṁḍum̐gā