Emtale daadanimoha memi seppeve

ఎంతలే దాతనిమోహ మేమి చెప్పేవే
Language

(॥పల్లవి॥)
ఎంతలే దాతనిమోహ మేమి చెప్పేవే
యింత నన్ను నాలించ నిది పరాకా

(॥ఎంత॥)
ఆయలేవే చాలుఁజాలు అతనికి నేనేలే
వేయువేయువలపులవేడుకకాఁడు
పాయమునఁ దనమీఁది భ్రమఁ బడే నింతేకాక
యీయెడ నాపైఁ దన కిది వరాకా

(॥ఎంత॥)
యెంచనేలే చెలియ తా నెక్కడెక్కడనైనాను
కంచపుఁబొత్తుసతులగమికాఁడు
వంచినచూపుల నేనే వలలఁ జిక్కితిఁగాక
యిఁచుకంతయినఁ దని కిది పరాకా

(॥ఎంత॥)
అందము సేయఁగనేలే యందుకేమి పెక్కిండ్ల-
విందు గాఁడా యాతఁడు శ్రీవేంకటేశుఁడు
పందెమాడి నన్నుఁగూడెఁ బాయకిట్టె తన కింక
యెందరు గలిగినాను యిది పరాకా

(||pallavi||)
ĕṁtale dādanimoha memi sĕppeve
yiṁta nannu nāliṁcha nidi parāgā

(||ĕṁta||)
āyaleve sālum̐jālu adanigi nenele
veyuveyuvalabulaveḍugagām̐ḍu
pāyamunam̐ danamīm̐di bhramam̐ baḍe niṁtegāga
yīyĕḍa nābaim̐ dana kidi varāgā

(||ĕṁta||)
yĕṁchanele sĕliya tā nĕkkaḍĕkkaḍanainānu
kaṁchabum̐bŏttusadulagamigām̐ḍu
vaṁchinasūbula nene valalam̐ jikkidim̐gāga
yim̐sugaṁtayinam̐ dani kidi parāgā

(||ĕṁta||)
aṁdamu seyam̐ganele yaṁdugemi pĕkkiṁḍla-
viṁdu gām̐ḍā yādam̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
paṁdĕmāḍi nannum̐gūḍĕm̐ bāyagiṭṭĕ tana kiṁka
yĕṁdaru galiginānu yidi parāgā